హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త :
హైదరాబాద్ లో నివసిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు వారి సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించే లక్ష్యంతో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని బిక్షపతి యాదవ్ కళ్యాణ మండపంలో జాబ్ మేళా మరియు ప్రజా దర్బార్ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.
ఈ సందర్భంగా మంత్రి వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ, ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న యువతకు ప్రభుత్వం మరిన్ని అవకాశాలు కల్పించేందుకు కట్టుబడి ఉందన్నారు. జాబ్ మేళా ద్వారా వివిధ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలను కల్పించడం ఆనందంగా ఉందని తెలిపారు.
ప్రజా దర్బార్‌లో హైదరాబాద్‌లో నివసిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు తమ వ్యక్తిగత, సామాజిక, పరిపాలనా సమస్యలను మంత్రి దృష్టికి తీసుకురాగా, ప్రతి వినతిని ఓర్పుగా విని సంబంధిత అధికారులతో సమన్వయం చేసి త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ప్రజలకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని, ఎక్కడ ఉన్నా ఆంధ్రప్రదేశ్ ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. ఉపాధి కల్పనతో పాటు ప్రజల సమస్యల పరిష్కారానికి ఇటువంటి కార్యక్రమాలు మరింత విస్తృతంగా నిర్వహిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా టిడిపి అధ్యక్షులుగుత్తుల సాయి, ప్రధాన కార్యదర్శి గంధం బాలరాజు ,రాజేష్ అంగటి , రేవు శ్రీను, తెలంగాణ రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ప్రజాప్రతినిధులు, ఆంధ్రప్రదేశ్ అధికారులు, మంత్రిసిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News