– సహాయ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఓటర్ల జాబితా సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ ముమ్మరంగా జరుగుతున్న నేపథ్యంలో ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలోని ఇగ్నైట్ సెల్‌లో సర్ సహాయ కేంద్రాన్ని సోమవారం ఏర్పాటు చేశారు. ఎస్ఐఆర్ ప్రాధాన్యతను వివరించడం, 2002 సర్ జాబితాలో వివరాలు చూసుకోవడం, ఎన్యూమరేషన్ ఫారాలను సరైన విధంగా నింపి, బీఎల్‌వోకు అందించడం, డిజిటైజేషన్ ప్రక్రియ తదితరాలపై ఓటర్లకు ఈ సెల్ ద్వారా అవగాహనతో పాటు సహాయసహాకారాలు అందించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. దోష రహిత ఓటర్ల జాబితా రూపకల్పన లక్ష్యంగా జరుగుతున్న ఈ ప్రక్రియను విస్తృత ప్రజా భాగస్వామ్యంతో విజయవంతం చేయనున్నట్లు కలెక్టర్ లక్ష్మీశ ఈ సందర్భంగా అన్నారు.
Prajavartha Online Telugu News