Breaking News

మెరుగైన వైద్యం కోసం ఎల్ఓసిలు అందజేత…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎమ్మెల్యే సుజనా చౌదరి సౌజన్యంతో ముఖ్యమంత్రి సహాయనిది నుండి మంజూరైన ఎల్ ఓ సీ (లెటర్ ఆఫ్ క్రెడిట్) లను ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ టీడీపీ రాష్ట్ర కార్యదర్శి షేక్ ఆషా, ఎన్టీఆర్ జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షుడు సోలంకి రాజు మరియు కూటమి నేతలతో కలిసి అందజేశారు. .

35 వ డివిజన్ , పేజ్జోని పేటకు చెందిన చెందిన రంజి కనక మహాలక్ష్మి కిడ్నీ స్టోన్స్ సమస్యతో బాధపడుతూ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. మెరుగైన వైద్యం అందించాలని శస్త్ర చికిత్స చేయాలని వైద్యులు తెలపడంతో ఎన్డీఏ కార్యాలయంలో వైద్యం సాయం కోసం దరఖాస్తు చేసుకోగా మంజూరైన రూ 2 లక్షల విలువైన ఎల్ ఓ సీ ను బాధితురాలికి.. అందజేశారు. అదే విధంగా 38 వ డివిజన్ కు చెందిన జలసూత్రం నాగ రామయ్య (41) మూత్రనాళ సమస్యతో బాధపడుతూ మెరుగైన వైద్యం కోసం ఎల్ ఓ సీ కొరకు దరఖాస్తు చేసుకోగా మంజూరైన రూ 3 లక్షల 35వేల ఎల్ ఓ సీ ను అందజేశారు. త్వరితగతిన స్పందించి ఎల్ ఓ సీ ను అందజేయడంతో బాధిత కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే సుజనా కు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సయ్యద్ సలీం ,రాజేష్ ,సురభి బాలు, విస్సం శెట్టి శ్రీనివాస్, జాహిద్, తాజుద్దీన్, కందుల సుబ్రహ్మణ్యం, బొల్లేపల్లి కోటేశ్వరరావు, ఏలూరి సాయి శరత్, సుజనా మిత్రా కోఆర్డినేటర్లు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఎన్.ఐ.డి. ప్రాంగణంలో 12వ జాతీయ చేనేత దినోత్సవ ముందస్తు వేడుకలు

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి సమీపంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (NID) ప్రాంగణంలో 12వ జాతీయ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *