పోషకాహారంతోనే విద్యార్థుల ఆరోగ్య భవిష్యత్

– పాఠ‌శాల‌ల్లో మధ్యాహ్న భోజనం నాణ్యతలో రాజీ ప్ర‌స‌క్తే లేదు
– ప్ర‌భుత్వం అందిస్తున్న సౌక‌ర్యాల‌ను స‌ద్వినియోగం చేసుకోండి
– జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విద్యార్థులకు అందించే పోషకాహారమే వారి ఆరోగ్యవంతమైన భవిష్యత్‌కు బలమైన పునాదిగా నిలుస్తుందని, పాఠశాలల్లో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకం నాణ్యతలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీకి తావు ఉండరాదని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు.
బుధవారం పెనుగంచిప్రోలులో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించి మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును పరిశీలించారు. విద్యార్థులకు అందిస్తున్న భోజనం నాణ్యత, మెనూ ప్రకారం ఆహారం అందిస్తున్నారా లేదా, వంటశాల పరిశుభ్రత, తాగునీటి సౌకర్యం, వంట స‌రుకుల నిల్వ విధానం, వంట ప్రక్రియ తదితర అంశాలను పరిశీలించి సంబంధిత సిబ్బందికి సూచ‌న‌లు చేశారు. విద్యార్థులకు ప్రతిరోజూ వేడివేడిగా, పరిశుభ్రంగా, పోషకాహార విలువలు కలిగిన భోజనం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వంటశాలలు పరిశుభ్రంగా ఉండటంతో పాటు ఆహార పదార్థాల నాణ్యతపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని సూచించారు. అనంతరం విద్యార్థులతో కలెక్టర్ మమేకమై వారి చదువులు, మధ్యాహ్న భోజనం నాణ్యత, పాఠశాలలో సౌకర్యాలపై ఆరా తీశారు. ప్రభుత్వం విద్యార్థుల కోసం అందిస్తున్న విద్యా, సంక్షేమ పథకాలు, మౌలిక సదుపాయాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత లక్ష్యాలను సాధించాలని క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ సూచించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మత్స్యకారుల సేవలో మరో కీలక నిర్ణయం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2026–27 సంవత్సరానికి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *