గవర్నర్‌ జస్టిస్ అబ్దుల్ నజీర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన డా. ఎన్‌టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి

-29, 30వ స్నాతకోత్సవ విశిష్ట ఘట్టాల స్మారక ఫోటో ఆల్బమ్‌ను గవర్నర్‌కు అందజేసిన ప్రతినిధి బృందం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
డా. ఎన్‌టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఉపకులపతి డా. పులాల చంద్రశేఖర్ ఆధ్వర్యంలోని ప్రతినిధి బృందం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్‌ జస్టిస్ అబ్దుల్ నజీర్ ను రాజ్‌భవన్‌లో మర్యాదపూర్వకంగా బుధవారం కలిసింది. ఈ బృందంలో విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్, డైరెక్టర్ (రిసెర్చ్ & డెవలప్‌మెంట్), డైరెక్టర్ ఆఫ్ పబ్లికేషన్స్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఇటీవల విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర గవర్నర్ అధ్యక్షతన విజయవంతంగా నిర్వహించిన డా. ఎన్‌టీఆర్ యూనివర్సిటీ 29,30వ స్నాతకోత్సవాల విశిష్ట ఘట్టాలను ప్రతిబింబించే స్మారక ఫోటో ఆల్బమ్‌ను ఉపకులపతి డా. పులాల చంద్రశేఖర్ గౌరవ గవర్నర్‌కు అందజేశారు. స్నాతకోత్సవాన్ని విజయవంతం చేయడంలో గవర్నర్ అందించిన మార్గదర్శకత్వం, సహకారం, ప్రోత్సాహానికి విశ్వవిద్యాలయం తరఫున ఉపకులపతి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా గవర్నర్, డా. ఎన్‌టీఆర్ యూనివర్సిటీ విద్య, పరిశోధన, ఆరోగ్య శాస్త్రాల అభివృద్ధికి చేపడుతున్న కార్యక్రమాలను అభినందిస్తూ, భవిష్యత్తులోనూ ఇదే నిబద్ధతతో ప్రజలకు, వైద్య విద్యకు సేవలందించాలని ఆకాంక్షించారు. ఈ భేటీ ఆత్మీయ వాతావరణంలో జరిగింది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మత్స్యకారుల సేవలో మరో కీలక నిర్ణయం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2026–27 సంవత్సరానికి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *