-రేపు మధ్యాహ్నం 2 గంటలకు జిల్లా కలెక్టర్ బాధిత కుటుంబాన్ని కలిసి సమస్య పరిష్కారంపై చర్యలు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
నంద్యాల జిల్లా బనగానపల్లి పట్టణంలో ఈరోజు జరిగిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా మండపేటకు చెందిన ముత్యాల సాయి దీప్తి తమ కుటుంబ ఆస్తికి సంబంధించిన సమస్యపై ముఖ్యమంత్రికి వినతిపత్రం సమర్పించారు.
వినతిపత్రంలో పేర్కొన్న వివరాల ప్రకారం, మండపేట ప్రధాన రహదారిలో ఉన్న స్థలానికి 2003 సంవత్సరంలో ఆమె తల్లి పేరుపై ప్రభుత్వం పట్టా మంజూరు చేసింది. అనంతరం ఆమె తల్లి అనారోగ్య పరిస్థితుల దృష్ట్యా 2015 సంవత్సరంలో గిఫ్ట్ డీడ్ ద్వారా ఆస్తిని ఆమె తండ్రి పేరుకు బదిలీ చేశారు. అప్పటి నుంచి నేటి వరకు సంబంధిత పంచాయతీ పన్నులు క్రమం తప్పకుండా చెల్లిస్తూ, చట్టబద్ధ హక్కుదారులుగా ఆ స్థలాన్ని అనుభవిస్తూ వస్తున్నారు.
ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పట్టా రెగ్యులరైజేషన్ స్కీమ్–2025 కింద తమ ఆస్తిని కూడా రెగ్యులరైజ్ చేయించుకోవాలనే ఉద్దేశంతో స్థానిక తహసీల్దార్‌ను సంప్రదించగా, సంబంధిత స్థలం 22-A జాబితాలో ఉన్నందున రెగ్యులరైజేషన్ చేయడం సాధ్యం కాదని అధికారులు తెలియజేశారు. దీంతో ఆందోళన చెందిన బాధిత కుటుంబం తమ సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లింది.
ఈ వినతిపై వెంటనే స్పందించిన ప్రభుత్వం, సమస్యను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. ఈ నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ఫిర్యాదుదారు తండ్రి ని రేపు (జూలై 10) మధ్యాహ్నం 2 గంటలకు కలిసి సమస్యను సమగ్రంగా పరిశీలించి, నిబంధనల మేరకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని తెలియజేశారు.
ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించడం రాష్ట్ర ప్రభుత్వ అత్యున్నత ప్రాధాన్యమని, ప్రతి వినతిని పారదర్శకంగా పరిశీలించి అర్హులైన వారికి న్యాయం అందించేందు
Prajavartha Online Telugu News