-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్)–2026 కార్యక్రమం పురోగతిపై విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్, ఎన్నికల నమోదు అధికారి (ERO) ధ్యానచంద్ర శనివారం ఉదయం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో విజయవాడ సెంట్రల్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎన్నికల జాబితాల రూపకల్పనలో పారదర్శకత, ఖచ్చితత్వం, నిష్పక్షపాత ధోరణి అత్యంత ముఖ్యమని కమిషనర్ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, సెంట్రల్ నియోజకవర్గంలో ఎస్‌ఐఆర్–2026 ప్రక్రియ ప్రణాళికాబద్ధంగా కొనసాగుతోందని తెలిపారు. ఎన్నికల జాబితాలో ఆబ్సెంట్ (Absent), మరణించిన (Death), శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు మారిన (Shifted), డూప్లికేట్ (Duplicate) ఓటర్ల వివరాల పరిశీలనలో రాజకీయ పార్టీల ప్రతినిధులు, బూత్ లెవల్ ఏజెంట్లు (BLAs), ఏఈఆర్వోలతో సమన్వయం చేసుకుని సహకరించాలని కోరారు. అర్హులైన ప్రతి ఓటరు పేరు జాబితాలో ఉండేలా, అనర్హుల పేర్లు నిబంధనల ప్రకారం తొలగించేలా ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు ప్రతి దరఖాస్తును క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని తెలిపారు. రాజకీయ పార్టీల నుంచి అందే సూచనలు, అభ్యంతరాలను నిబంధనల ప్రకారం పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియను పూర్తి పారదర్శకతతో నిర్వహించేందుకు ప్రతి రాజకీయ పార్టీ చురుకుగా భాగస్వామ్యం కావాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సమావేశంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు ఎన్. నరసింహారావు (INC), ఎన్. వీరభద్రరావు (సీపీఐ), బి. రమణారావు సీపీఐ (ఎం), ఎన్. సాంబశివరావు (TDP), జి. సుందర్ పాల్ (YSRCP), వంశీ కృష్ణ (JSP) ఏఈఆర్వో & చీఫ్ సిటీ ప్లానర్ కె. సంజయ్ రత్నకుమార్, ఏఈఆర్వో & అసిస్టెంట్ సిటీ ప్లానర్–II వై. రాంబాబు, ఏఈఆర్వో & సూపరింటెండింగ్ ఇంజనీర్ (ప్రాజెక్ట్స్) పి. సత్యకుమారి, ఏఈఆర్వో & జోనల్ కమిషనర్–II కె. ప్రభుదాస్, ఏఈఆర్వో & తహసీల్దార్ (విజయవాడ సెంట్రల్) వి. దివ్య, ఏఈఆర్వో & తహసీల్దార్ (విజయవాడ నార్త్ మండలం) కె. లక్ష్మి, ఎలక్షన్ డి.టి ఎస్. సురేష్ కుమార్ పాల్గొన్నారు
Prajavartha Online Telugu News