విద్యుత్ బస్సుల నిర్వహణ, మూసివేసిన డిపోల పునరుద్ధరణపై స్పష్టత లేకపోవడంతో మా ఉద్యమం కొనసాగుతుంది.

-జేఏసీ రెండో దశ ఉద్యమంలో భాగంగా ఈ నెల 14 నుంచి 19 వరకు ప్రజాప్రతినిధులను కలిసి ఉద్యమానికి మద్దతు కోరుతూ వినతిపత్రాలు అందజేస్తాం.
-ఈ నెల నుంచే ఆర్టీసీ ఉద్యోగులందరి సంతకాల సేకరణ చేపట్టి, ఈ నెల 27న నిర్వహించే ‘గ్రీవెన్స్ డే’ సందర్భంగా ముఖ్యమంత్రికి వినతిపత్రాన్ని సమర్పిస్తాం.
-ఈ నెల 30న విజయవాడలో ఆర్టీసీ ఉద్యోగ సంఘాల జేఏసీ సమావేశాన్ని నిర్వహించి, మూడో దశ ఆందోళన కార్యక్రమాలను ప్రకటిస్తాం.
– ఆదివారం గూగూల్ మిట్ ద్వారా జరిగిన ఆర్టిసి జేఏసి రాష్ట్రకార్యవర్గం జరిగింది.

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఏపియస్ ఆర్టిసిలోకి ప్రైవేట్ ఆపరేటర్ల ద్వారా విద్యుత్ బస్సుల నిర్వహణ వల్ల ఆర్టీసీకి, ప్రయాణికులకు, ఉద్యోగులకు కలిగే నష్టాలను వివరించడంతో పాటు, విద్యుత్ బస్సుల నిర్వహణ కోసం మూసివేసిన నాలుగు డిపోలను వెంటనే పునరుద్ధరించాలని, ఇతర ప్రధాన సమస్యలతో కలిపి మొత్తం 30 డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని గత నెల 11వ తేదీన ఆర్టీసీ యాజమాన్యానికి సమర్పించామని ఏపిపిటిడి (ఆర్టీసీ) ఉద్యోగ సంఘాల జేఏసీ కన్వీనర్లు వై. శ్రీనివాసరావు, పలిశెట్టి దామోదరరావు తెలిపారు.

ఆర్టీసి జేఏసి ఇచ్ఛిన డీమాండ్లు పై ఈ నెల 6న ఒకసారి, 7 న రెండుసార్లు, 9వ తేదీన గూగుల్ మీట్ ద్వారా ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (టీ.ఆర్.&బీ) ఎం.టి. కృష్ణబాబు (ఐఏయస్), ఆర్టీసీ ఎండీ  బాలసుభ్రమణ్యం (ఐపియస్), ఆర్టీసిఈడీలు మరియు జేఏసీ నాయకుల మధ్య పలుమార్లు చర్చలు జరిగాయని తెలిపారు.

అయితే జేఏసీ డిమాండ్ల పరిష్కారం, మూసివేసిన డిపోల పునరుద్ధరణ తదితర అంశాలపై అధికారులు శనివారం అందజేసిన డ్రాఫ్ట్ మినిట్స్‌లో ఎలాంటి స్పష్టమైన హామీలు లేకపోవడంతో, ముందుగా ప్రకటించిన రెండో దశ ఉద్యమ కార్యక్రమాలను యథావిధిగా కొనసాగించాలని ఆదివారం అత్యవసరంగా నిర్వహించిన జేఏసీ గూగుల్ సమావేశంలో ఏకగ్రీవంగా నిర్ణయించినట్లు కన్వీనర్లు వెల్లడించారు.

ఈ సమావేశంలో జేఏసీ కో-కన్వీనర్లు పి.వి. రమణారెడ్డి, జి.వి. నరసయ్య, సి.హెచ్. సుందరయ్య, కట్టా సుబ్రహ్మణ్యం, ఎస్.వి. శేషగిరిరావు, కె. సూర్యప్రకాశరావు, డి. మాల్యాద్రి తదితరులతో పాటు ఆర్టిసి జేఏసీ రాష్ట్రకార్యవర్గం 36 మంది సభ్యులు పాల్గొని ఉద్యమ కార్యాచరణపై విస్తృతంగా చర్చించినట్లు కన్వీనర్లు తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మత్స్యకారుల సేవలో మరో కీలక నిర్ణయం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2026–27 సంవత్సరానికి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *