Breaking News

నగరంలో ఈనెల 16న జగన్నాథ రథయాత్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ ఇస్కాన్ ఆధ్వర్యంలో ఈనెల 16న శ్రీ జగన్నాథ రథయాత్ర-2026ను వైభవంగా నిర్వహించనున్నట్లు ఇస్కాన్ నగర అధ్యక్షులు చక్రధారిదాస్ తెలిపారు. మంగళవారం సీతమ్మ వారి పాదాల వద్ద గల ఇస్కాన్ శిబిరంలో చక్రధారిదాస్ పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ… 16 నుంచి 18 వరకు మూడు రోజుల పాటు ఇస్కాన్ ఉత్సవ్ మేళాలో భాగంగా ప్రతిరోజు సాయంత్రం 5 నుండి రాత్రి 9:30 గంటల వరకు సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 16వ తేదీ మధ్యాహ్నం విద్యాధరపురం సితార గ్రౌండ్స్ నుండి సీతమ్మ వారి పాదాల వరకు రథయాత్ర సాగుతుందని, దీనికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్ హాజరవుతారని పేర్కొన్నారు. ఉత్సవాల్లో సుమారు లక్ష మంది భక్తులకు అన్నప్రసాద వితరణ జరుగుతుందని, ప్రజలందరూ పాల్గొని రథయాత్రను జయప్రదం చేయాలని చక్రధారిదాస్ కోరారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఎన్.ఐ.డి. ప్రాంగణంలో 12వ జాతీయ చేనేత దినోత్సవ ముందస్తు వేడుకలు

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి సమీపంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (NID) ప్రాంగణంలో 12వ జాతీయ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *