Breaking News

ప్రైవేట్ బస్సుల పన్ను తగ్గింపుపై కూటమి ప్రభుత్వానికి ఘనంగా కృతజ్ఞత సభ…

-ఏపీ ప్రైవేట్ బస్సు అసోసియేషన్ నూతన లోగో, “థాంక్యూ సీఎం సార” సందేశంతో ఉన్న బస్సును ఆవిష్కరించిన మంత్రి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అంతరాష్ట్ర బస్సుల పన్ను 4,000గా ఉన్న పన్నును 2,500 వరకు తగ్గింపుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ బస్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయవాడలోని సృజన కళ్యాణ అవెన్యూలో ఏర్పాటు చేసిన కృతజ్ఞత సభను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ… కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టూరిస్ట్ బస్సుల పన్ను మినహాయింపు నిర్ణయం తీసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం వెనుక మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చొరవ, నిరంతర కృషి ఎనలేనిదని కొనియాడారు. గత ప్రభుత్వాలు చేయలేని పనిని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సునాయాసంగా చేసి చూపించారని అభినందించారు.
మంత్రి మాట్లాడుతూ… రవాణా రంగ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రైవేట్ బస్సుల యాజమాన్యాలు ఎదుర్కొంటున్న సమస్యలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించామని తెలిపారు. రవాణా భద్రతపై ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని, రవాణా రంగంలో ఉన్న ప్రతి సమస్య పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుందని, ప్రైవేట్ ఆపరేటర్లకు బివోటి విధానంలో టెర్మినల్ ఏర్పాటు చేస్తామని, ప్రైవేట్ రవాణా రంగ అభివృద్ధికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. కార్యక్రమంలో మంత్రి ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ బస్సు అసోసియేషన్ నూతన లోగోను ఆవిష్కరించారు. అనంతరం టూరిస్ట్ బస్సుల పన్ను తగ్గింపు నిర్ణయం తీసుకున్న కూటమి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పట్ల కృతజ్ఞతగా ప్రత్యేకంగా రూపొందించిన “థాంక్యూ సీఎం సార” సందేశంతో ఉన్న బస్సును మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు గౌతమ్ కిరణ్, ప్రతినిధులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పోలవరానికి పర్యాటక శోభ

-ప్రాజెక్టుతో పాటు గోదావరి తీరంలో టూరిజం అభివృద్దికి మాస్టర్ ప్లాన్ -అఖండ గోదావరి ప్రాజెక్టు కింద నదీతీరం అభివృద్ది -అధికారులు, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *