Breaking News

201 కుటుంబాల వందేళ్ల సమస్యకు పరిష్కారం

-పుల్లడిగుంట గ్రామ ప్రజలకు తీపి కబురు
-నిషేధిత జాబితాలో ఉన్న ఇళ్ల స్థలాలకు పూర్తి హక్కులు
-శెట్టిపల్లి, వట్టిచెరుకూరు, కుంగుంది బాటలో పుల్లడిగుంట
-మున్మందు మిగిలిన దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం: మంత్రి అనగాని

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
దీర్ఘకాలికంగా నిషేధిత జాబితాలో ఉండి హక్కులకు నోచుకొని గ్రామాలకు కూటమి ప్రభుత్వం తీపి కబురు అందిస్తోంది. తాజాగా వందేళ్ల నుండి నిషేధిత జాబితాలో ఉండి హక్కులకు నోచుకొని పుల్లడిగుంట గ్రామ ప్రజలందరి సమస్యను తీర్చింది. ఈ గ్రామంలో ఉన్న 201 కుటుంబాలకు సంబంధించిన ఇళ్లు అన్ని కూడా నిషేధిత జాబితాలో ఉన్నాయి. వందేళ్ల క్రితమే ఈ గ్రామంలో ఇళ్లు నిర్మించుకున్నారు. ఎప్పటి నుండో గ్రామ పంచాయితీకి పన్నులు కడుతున్నారు. చాలా ఏళ్ల కాలం నుండి కరెంట్ బిల్లులు చెల్లిస్తున్నారు. ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం కార్నెపాడు రెవెన్యూ గ్రామానికి హెమ్లేట్ గా ఉన్న పుల్లడిగుంట ప్రజలు తమ సమస్యను కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రెవెన్యూ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్ దృష్టికి తీసుకొచ్చారు. తోపు పోరంబోకుగా వర్గీకరించబడ్డ తమ గ్రామం మొత్తం ఉన్న ప్రాంతాన్ని నిషేధిత జాబితా నుండి తొలగించి గ్రామ ప్రాంతం గా వర్గీకరించాలని కోరుతూ ఆ గ్రామ పంచాయితీ తీర్మానం చేసి పంపించింది. ఈ సమస్య తీవ్రతను గమనించిన మంత్రి అనగాని సత్యప్రసాద్ సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లగా ఆయన ఆదేశాల మేరకు అధికారులతో గ్రామ రికార్డులను పరిశీలించారు. వందేళ్ల నుండి అక్కడ ప్రజలు ఇళ్లు నిర్మించుకొని ఉంటున్నారని, 8.51 ఎకరాల్లో ఇళ్లు, అంతర్గత రోడ్లు నిర్మించి ఉన్నాయని రీ సర్వేలో తేలిందని నిర్ధారించారు. ఈ ఇళ్లకు పక్కనే ప్రభుత్వ ఉర్దూ పాఠశాల, రామలయం, మజిద్ కూడా ఉంది. వీటితోపాటు ఎకరం 27 సెంట్లు ఖాళీ భూమి కూడా ఉంది. జిల్లా అధికారుల నుండి వచ్చిన నివేదిక ఆధారంగా తోపు పోరంబోకుగా ఉన్న భూమిని గ్రామ ప్రాంతంగా మార్చాలని, ఖాళీ స్థలాన్ని ప్రభుత్వ స్థలంగా పేర్కొనాలని, ఇళ్ల స్థలాలు ఉన్న 8.51 ఎకరాలను నిషధిత జాబితా నుండి తొలగించాలని రెవెన్యూ శాఖ ప్రతిపాదించింది. అదే విధంగా పక్కనే ఉన్న ఎకరం 27 సెంట్లను ప్రభుత్వ స్థలంగా పేర్కొంటూ, ఈ స్థలం తోపాటు ప్రభుత్వ ఉర్దూ పాఠశాల, రామలయం, మజీద్ స్థలాలను నిషేధిత జాబితాలో ఉంచాలని కోరుతూ రాష్ర్ట మంత్రి వర్గానికి ప్రతిపాదనలు పంపగా అనుమతి లభించింది. దీంతో పుల్లడిగుంట వందేళ్ల సమస్యకు పరిష్కారం చూపుతూ ఒకటి, రెండు రోజుల్లో ఉత్తర్వులు ఇవ్వనున్నారు.

మున్ముందు మరిన్ని దీర్ఘకాలిక రెవెన్యూ సమస్యలకు పరిష్కారం: మంత్రి అనగాని
దీర్ఘకాలికంగా పెడింగ్ లో ఉండి హక్కులకు నోచుకొని గ్రామలకు విముక్తి కల్గించేందుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తోందని రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. తిరుపతి జిల్లా శెట్టి పల్లి గ్రామంలో దశాబ్దాల కాలం నుండి హక్కుల్లేక ఇబ్బందులు పడుతున్న రెండు వేలమంది సమస్యను పరిష్కరించి వారి జీవితాల్లో వెలుగు నింపామన్నారు. అదే విధంగా బ్రిటీష్ అధికారుల చేసిన పొరపాటు కారణంగా 120 ఏళ్ల నుండి నిషేధిత జాబితాలో ఉన్న మండల కేంద్రమైన వట్టి చెరుకూరులోని 5వేల మంది ప్రజలకు వారి ఆస్తులపై హక్కులు కల్పించామన్నారు. ఆ తర్వాత కుప్పం నియోజకవర్గంలోకి కుంగుంది గ్రామంలో 61 ఏళ్ల భూ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపి 322 మంది పేదలకు డికేటీ పట్టాలను అందజేశామన్నారు. వ్యక్తులకు కాకుండా సమూహంగా ఒకే రకమైన సమస్య ఎదుర్కొంటున్న వారికి హక్కులు కల్పించేందుకు రెవెన్యూ శాఖ విశేషంగా కృషి చేస్తోందని, మున్మందు ఇలాంటి సమస్యలున్న గ్రామాలకు విముక్తి కల్పిస్తామని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పోలవరానికి పర్యాటక శోభ

-ప్రాజెక్టుతో పాటు గోదావరి తీరంలో టూరిజం అభివృద్దికి మాస్టర్ ప్లాన్ -అఖండ గోదావరి ప్రాజెక్టు కింద నదీతీరం అభివృద్ది -అధికారులు, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *