కడప, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో ఒక రోజు పర్యటన నిమిత్తం జిల్లా ఇన్చార్జి మంత్రి సవిత కడపకు విచ్చేశారు. బుధవారం జమ్మలమడుగులోని దాల్మియ సిమ్మెంట్ పరిశ్రమ రెండో ప్లాంట్ విస్తరణ పనుల ప్రారంభోత్సవంలో మంత్రి సవిత పాల్గొననున్నారు. ఈ మేరకు మంత్రి కార్యాలయం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. రూ. 3,478 కోట్లతో జమ్మలమడుగు నియోజకవర్గం మైలవరం మండలం చిన్నకొమెర్లలో దాల్మియా సిమెంట్ లైన్-2 ప్లాంట్ విస్తరణ పనులకు రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ శంకుస్థాపన చేయనున్నారు. సిమ్మెంట్ పరిశ్రమ విస్తరణ పనుల్లో జిల్లా ఇన్చార్జిమంత్రి సవిత పాల్గొనున్నారు. దీనిలో భాగంగా మంగళవారం రాత్రి 6.30 గంటలకు కడప ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా జమ్మలమడుగుకు చేరుకున్నారు. అక్కడే రాత్రి బస చేశారు. దాల్మియా సిమ్మెంట్ విస్తరణ పనుల శంకుస్థాపన అనంతరం జిల్లాలో జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. సాయంత్రం 5.30 గంటలకు కడప విమానాశ్రయానికి చేరుకుని, విజయవాడకు మంత్రి సవిత పయనమవుతారని మంత్రి కార్యాలయం ఆ ప్రకటనలో తెలిపింది.
Prajavartha Online Telugu News