Breaking News

ఆర్ &బీ శాఖలో 17 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న కారుణ్య నియామకానికి ఆమోదం

-సచివాలయం ఆర్ & బీ మంత్రి కార్యాలయంలో కే. లక్ష్మణ్ కుమార్ కు ఉద్యోగ నియామక పత్రం అందజేసిన మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి
-కాకినాడ డివిజన్ లో పనిచేస్తూ మరణించిన గ్యాంగ్ మజ్దూర్ కే.వీ అప్పారావు కుమారుడికి లభించిన ఉద్యోగం
-కారుణ్య నియామకాల బాధిత కుటుంబాలకు న్యాయం చేస్తామని ప్రతిపక్షంలో హామీ ఇచ్చిన సీఎం చంద్రబాబు
-ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని నెరవేరుస్తూ మానవతా దృక్పథంతో నిర్ణయం తీసుకున్న కూటమి ప్రభుత్వం
-17 ఏళ్ల సుదీర్ఘ సమస్యను పరిష్కరించినందుకు సీఎం చంద్రబాబు, మంత్రి జనార్థన్ రెడ్డిలకు బాధిత కుటుంబం కృతజ్ఞతలు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆర్ & బీ శాఖలో సుధీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న కారుణ్య నియామకానికి ఆర్ & బీ శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి ఆమోదం తెలిపారు.. నేడు సచివాలయంలోని ఆర్ & బీ శాఖ మంత్రి కార్యాలయంలో బాధిత కుటుంబాన్ని ప్రభుత్వ ఉద్యోం కల్పిస్తూ, నియామక పత్రాన్ని మంత్రి చేతులు మీదుగా అందజేశారు.. ఈ సందర్భంగా నూతనంగా నియామక పత్రం అందుకున్న కే. లక్ష్మణ్ కుమార్ ను మంత్రి అభినందించిగా, ఆయన మంత్రికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.

గతంలో కాకినాడ ఆర్ & బీ డివిజన్ లో ఉద్యోగ విధులు నిర్వహిస్తున్న సమయంలో గ్యాంగ్ మజ్ధూర్ కే.వీ అప్పారావు అనారోగ్యంతో మరణించారు.. నాటి నుంచి వారి కుటుంబం కారుణ్య నియామకం కోసం ఆర్ & బీ శాఖ ఉన్నతాధికారులకు విన్నవించుకోవడం జరుగుతుంది. ఆర్ &బీ శాఖలో దాదాపు 2009 నుంచి పెండింగ్ లో ఉన్న కారుణ్య నియామకం అంశంపై నేడు కూటమి ప్రభుత్వంలో మంత్రి ప్రత్యేక చొరవతో ముందుకు కదిలింది…

ప్రతిపక్షంలో ఉండగా, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పెండింగ్ లో ఉన్న కారుణ్య నియామకాల విషయంలో బాధిత కుటుంబాలకి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో నాడు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని నేరవేర్చుతూ.. నేడు గ్యాంగ్ మజ్దూర్ కే.వీ అప్పారావు కుమారుడు కే లక్ష్మణ్ కుమార్ ను మానవతా దృక్ఫథంతో ప్రభుత్వ సర్వీసులోకి తీసుకొవడం జరిగింది.

ధీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న సమస్యను పరిష్కరించి, నేడు బాధిత కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించి, అండగా నిలవడం జరిగింది. ఈ నేపథ్యంలో దాదాపు 17 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న తమ విన్నపాన్ని మన్నించి, సానుకూల నిర్ణయం తీసుకోవడం బాధిత కుటుంబం సంతోషం వ్యక్తం చేస్తోంది.. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి బీసీ జనార్థన్ రెడ్డిలకు బాధిత కుటుంబం తమ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసింది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పోలవరానికి పర్యాటక శోభ

-ప్రాజెక్టుతో పాటు గోదావరి తీరంలో టూరిజం అభివృద్దికి మాస్టర్ ప్లాన్ -అఖండ గోదావరి ప్రాజెక్టు కింద నదీతీరం అభివృద్ది -అధికారులు, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *