Breaking News

ఆర్టీజీఎస్‌ను సంద‌ర్శించిన సింగ‌పూర్ బృందం

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త :
రియ‌ల్ టైమ్ గ‌వ‌ర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్‌) కేంద్రాన్ని సింగ‌పూర్‌కు చెందిన ప్ర‌తినిధుల బృందం మంగ‌ళ‌వారం సంద‌ర్శించింది. స‌చివాల‌యంలోని ఆర్టీజీఎస్ క‌మండ్ కంట్రోల్ కేంద్రాన్ని ఈ బృందం తిల‌కించింది. సింగ‌పూర్ ప్ర‌భుత్వ సాంకేతిక విభాగం అసిస్టెంట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ట‌న్ ఇంగ్ ఫెండ్ నేతృత్వంలో వ‌చ్చిన ఈ బృందానికి ఆర్టీజీఎస్ అధికారులు స్వాగ‌తం ప‌లికారు. ఆర్టీజీఎస్ ప‌నితీరును ఆ బృందానికి వివ‌రించారు. డేటా డ్రివ‌న్ గ‌వ‌ర్నెన్స్ ఆశ‌యాలు, డేటా లేక్‌, డేటా లెన్స్‌, త‌దిత‌ర కార్యక‌లాపాల గురించి ఆర్టీజీఎస్ అధికారులు వివ‌రించారు. సింగ‌పూర్ ప్ర‌భుత్వం డేటా స‌మ‌ర్థ వినియోగంతో అక్క‌డ ప్ర‌భుత్వ కార్య‌క‌లాపాల‌ను ఎంత స‌మ‌ర్థవంతంగా నిర్వ‌హిస్తున్న తీరును సింగ‌పూర్ ప్ర‌తినిధి బృందం వివ‌రించింది. ఈ స‌మావేశంలో ఆర్టీజీఎస్ సీఈఓ ప్ర‌ఖర్ జైన్‌, డిప్యూటీ సీఈఓ ఎం. మాధురి, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్లు పి. శ్రీఖ‌ర్‌, కె. చైత‌న్య త‌దిత‌రులు పాల్గొన్నారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పోలవరానికి పర్యాటక శోభ

-ప్రాజెక్టుతో పాటు గోదావరి తీరంలో టూరిజం అభివృద్దికి మాస్టర్ ప్లాన్ -అఖండ గోదావరి ప్రాజెక్టు కింద నదీతీరం అభివృద్ది -అధికారులు, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *