-పశుసంవర్ధక రంగంలో AI ద్వారా సాంకేతిక విప్లవానికి ప్రతిపాదన
-రాయచోటికి చెందిన MindT సంస్థ రూపొందించిన AI ప్రాజెక్టుపై మంత్రి మండిపల్లికి ప్రజెంటేషన్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ని సచివాలయంలో MindT Private Limited సంస్థ ప్రాజెక్టు రూపకర్త ఆసిఫ్ షాహాబుద్దీన్ ఖాదర్ వలీ మర్యాదపూర్వకంగా కలిసి Pashu-AI (పశు-ఏఐ) లైవ్ స్టాక్ మేనేజ్మెంట్ ప్రాజెక్టును వివరించారు.
సోలార్ శక్తితో పనిచేసే స్మార్ట్ కాలర్ల ద్వారా పశువుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం, వ్యాధులను ముందుగానే గుర్తించడం, పశువుల ట్రాకింగ్, చోరీల నివారణ, అలాగే ప్రభుత్వానికి వ్యాధుల నియంత్రణ కోసం రియల్‌టైమ్ డేటా అందించే విధానాన్ని ఆయన మంత్రికి వివరించారు. తొలి దశలో ఒక మండలంలో 200 పశువులతో 90 రోజుల పైలట్ ప్రాజెక్టును అమలు చేయాలని ప్రతిపాదించారు. రైతులకు నష్టం తగ్గించడం, పశుసంవర్ధక సేవలను మరింత సమర్థవంతంగా అందించడంలో ఈ ప్రాజెక్టు ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ ప్రతిపాదిత అంశాలను శాఖ అధికారులు కూడా వివరించాలని మంత్రి వారికి సూచన చేశారు.
Prajavartha Online Telugu News