Breaking News

జీవో నెం.45 అమలులో విద్యుత్ సంస్థల జాప్యం – వేలాది ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన…

-విద్యుత్ సంస్థల నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తున్న ఉద్యోగులు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముగ్గురు మినిస్టర్లతో కమిటీ వేసి, సుదీర్ఘ సమయంలో అన్ని విషయాలు చర్చించి, కేబినెట్ ఆమోదంతో, ఎంతో ప్రతిష్టాత్మకంగా, దాదాపు 15 వేల మందికి మేలు చేసేలా, ఈ నెల రెండవ తేదిన జారి చేసిన జి.ఓ.ఎం.ఎస్. నెం.45 ద్వారా ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, సొసైటీలు మరియు ఇతర ప్రభుత్వ అనుబంధ సంస్థల ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాలకు పెంచెందుకై అవకాశం కల్పించింది. ఈ నిర్ణయాన్ని ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు, వివిధ కార్పొరేషన్ల, సొసైటీల ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు హర్షాతిరేకాలతో స్వాగతించాయి. కొన్ని సంవత్సరాలుగా ఉద్యోగ సంఘాలు అందరికీ 62 సంవత్సరాలు వర్తింప చేయాలని కోరుతున్నాయి.
అయితే, రాష్ట్ర విద్యుత్ రంగ సంస్థలైన APTRANSCO, APSPDCL, APEPDCL, APCPDCL మరియు APGENCOలో మాత్రం ఇప్పటివరకు ఈ జీవో అమలుకు సంబంధించి ఎలాంటి పరిపాలనా ఉత్తర్వులు జారీ కాకపోవడం వేలాది మంది ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళనకు కారణమైంది. ఇందుకు సంబంధించి ఎనర్జీ డిపార్మెంట్ కూడా ఉత్తర్వులు ఇచ్చింది, అయితే 8 వ తేదిన ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ AP Transco, విజయానంద్ సమావేశం ఏర్పాటు చేసి ఇందుకు సంబంధించి ఆరు గురు సభ్యులతో 15 రోజుల లోపు కమిటీ రిపోర్టు ఇవ్వాలని ఆదేశించారు. ప్రభుత్వం స్పష్టమైన విధాన నిర్ణయం తీసుకుని జీవో జారీ చేసినప్పటికీ, మళ్ళీ కమిటీ పేరుతో జాప్యం చేయడం ఉద్యోగులకు తీవ్ర నష్టం కలిగించడమే అని విద్యుత్ ఉద్యోగులు భావిస్తున్నారు. ఇలా చేయడం అంటే ప్రభుత్వ ఇచ్చిన జి.ఓ.నంబర్ 45 ను ప్రశ్నించడమే అని పేర్కొన్నారు.విద్యుత్ సంస్థల్లో అమలు విషయంలో కొనసాగుతున్న జాప్యంపై ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
విద్యుత్ సంస్థలు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలేనని, ప్రభుత్వం తీసుకున్న విధాన నిర్ణయాలు కూడా విద్యుత్ సంస్థలకు కూడా వర్తిస్తాయని ఉద్యోగులు గుర్తు చేస్తున్నారు. రాష్ట్ర విభజన చట్టం 2104 అనుసరించి షెడ్యూలు 9, 10 లో వున్న అన్ని కార్పొరేషన్లకు, ప్రభుత్వ రంగ సంస్థలకు , ఉత్తర్వులు వర్తిస్తాయని GO 45 లో స్పష్టంగా పేర్కొన్నప్పటికి జాప్యం చేయడం లో ఆంతర్యం ఏంటని వారు ప్రశ్నించారు. అన్ని ఉద్యోగ సంఘాలు ఇవ్వాలని డిమాండ్ చేసినప్పటికీ, విద్యుత్ సంస్థలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం తగదు అని తెలిపారు. పదవీ విరమణ వయస్సు పెంపు విషయం లో ఉన్నత న్యాయ స్థానం ఇచ్చిన ఉత్తర్వులను కూడా లెక్క చేయక పోవడం దురదృష్ట కరమైన విషయం అని పేర్కొన్నారు. పదవీ విరమణ వయస్సు పెంపు విషయంలో మాత్రమే ఆలస్యం చేయడం సమంజసం కాదని వారు అభిప్రాయపడుతున్నారు.
ప్రస్తుతం 60 సంవత్సరాల వయస్సుకు చేరుకున్న లేదా ఈ నెల 31 వ తేదీన పదవీ విరమణ చేయాల్సిన ఉద్యోగులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారని ఉద్యోగ సంఘాల నాయకులు పేర్కొంటున్నారు. జీవో అమలు ఆలస్యం కారణంగా వారి కుటుంబాల భవిష్యత్తు, ఉద్యోగ భద్రత, సేవా ప్రయోజనాలపై అనిశ్చితి నెలకొన్నదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వం జారీ చేసిన జీవో అమలుపై విద్యుత్ శాఖ మరియు విద్యుత్ సంస్థల యాజమాన్యాలు ఇప్పటికైనా స్పష్టమైన నిర్ణయం ప్రకటించాలని ఉద్యోగులు కోరుతున్నారు. ముఖ్యంగా ప్రభుత్వం ప్రకటించిన సంక్షేమ నిర్ణయాన్ని అమలు చేయడంలో జాప్యం చేయకుండా, వెంటనే విద్యుత్ సంస్థల్లో అమలులోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ విషయం పై విద్యుత్ శాఖ మాత్యులు గొట్టిపాటి రవి కుమార్ గారికి వివిధ కార్మిక సంఘాల నాయకులు వెంటనే అమలు చేయాలి ఉత్తరాలు ఇచ్చారు, ముఖ్యమంత్రి వర్యులు స్పందించి వెంటనే ఉత్తర్వులు ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని విద్యుత్ ఉద్యోగులు కోరుచున్నాను.
ఉద్యోగ సంఘాల అభిప్రాయం ప్రకారం, జీవో నెం.45 అమలులో ఆలస్యం కొనసాగితే ఉద్యోగుల్లో అసంతృప్తి మరింత పెరిగే అవకాశం ఉందని, దీనివల్ల సంస్థల పరిపాలనపై కూడా ప్రభావం పడే ప్రమాదం ఉందని పేర్కొంటున్నారు. ప్రభుత్వం, ఇంధన శాఖ మరియు విద్యుత్ సంస్థల యాజమాన్యాలు సమన్వయంతో వ్యవహరించి వెంటనే అమలు ఉత్తర్వులు జారీ చేయాలని వారు కోరుతున్నారు.
ప్రభుత్వం ప్రకటించిన సంక్షేమ నిర్ణయాలపై ఉద్యోగులకు పూర్తి విశ్వాసం కల్పించాలంటే, జి.ఓ. నెం.45ను విద్యుత్ రంగంలో కూడా తక్షణమే అమలు చేయడం అత్యవసరమని ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. ఆలస్యం కొనసాగితే న్యాయపరమైన మరియు ప్రజాస్వామ్యబద్ధమైన మార్గాల్లో తమ హక్కుల సాధనకు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు వలసి వుంటుంది అని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి సుదర్శన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేస్తూ, ఉద్యోగుల ప్రయోజనం కోసం వెంటనే, అమలు చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వము జోక్యం చేసుకుని తగు చర్యలు చేపట్టాలని మనవి చేసా రు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఎన్.ఐ.డి. ప్రాంగణంలో 12వ జాతీయ చేనేత దినోత్సవ ముందస్తు వేడుకలు

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి సమీపంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (NID) ప్రాంగణంలో 12వ జాతీయ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *