Breaking News

సమస్యలు సాధన కోసం ప్రత్యక్ష పోరాటాలకు సిద్ధ పడాలి

-సమగ్ర శిక్ష పీటీఐ యూనిటీ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్రనాయకులు పిలుపు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ఆర్ట్, వర్క్, వ్యాయామ ఉపాధ్యాయులతో పాటు ఇతర విభాగాల కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యక్ష పోరాటాలకు సిద్ధం కావాల్సిన సమయం ఆసన్నమైందని సమగ్ర శిక్ష పీటీఐ యూనిటీ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి సైకం శివకుమారి రెడ్డి,రాష్ట్రప్రధానకార్యదర్శి శంకరరావు పిలుపు నిచ్చారు.

ఆదివారం విజయవాడలోని రెవెన్యూ అసోసియేషన్ భవనంలో నిర్వహించిన సమగ్ర శిక్ష ఆర్ట్, వర్క్, వ్యాయామ ఉపాధ్యాయుల రాష్ట్ర స్థాయి సదస్సులో శివకుమార్ రెడ్డి మాట్లాడుతూ, ఒక నిర్దిష్ట కార్యాచరణ ప్రణాళికతో పాఠశాల, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో దశలవారీగా నిరసన కార్యక్రమాలు చేపట్టి ప్రభుత్వం దృష్టికి ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలను తీసుకెళ్లాలని అన్నారు.
సమగ్ర శిక్షలోని ఇతర విభాగాల ఉద్యోగ సంఘాలతో పాటు పీటీఐ సంఘాలను ఏకం చేసి ఉద్యమాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం త్వరలోనే నిరసన కార్యక్రమాల షెడ్యూల్, కార్యాచరణను రూపొందించి అమలు చేస్తామని తెలిపారు.
జిల్లా, రాష్ట్ర స్థాయి బాధ్యులు సంఘం పిలుపు మేరకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి, కింది స్థాయి సభ్యులను సమన్వయం చేసుకుంటూ అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని ఆమె సూచించారు.
గత 14 సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్నప్పటికీ ఉద్యోగాల క్రమబద్ధీకరణ జరగలేదని, కనీస ఉద్యోగ భద్రత, మినిమం టైమ్ స్కేల్ కూడా అమలు కాలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే 13 ఏళ్ల సర్వీసు పూర్తయిన ఉద్యోగులకు ఈఎస్ఐ, ఈపీఎఫ్ సౌకర్యాలు కల్పించడంతో పాటు పదవీ విరమణ వయస్సును 62 సంవత్సరాలకు పెంచాలని, పదవీ విరమణ సమయంలో గ్రాట్యుటీ మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈసమావేశంలో మూఖ్యఅతిధిగా పాల్గోన్న ఏపిజేఏసి అమరావతి చైర్మన్ బొప్పరాజువెంకటేశ్వర్లు మాట్లాడుతూయూనిటీ అసోషియేషన్ఉద్యమానికి ఏపీ జేఏసీ అమరావతి సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు.
సమగ్ర శిక్ష పీటీఐలు చేపట్టనున్న నిరసన కార్యక్రమాలకు ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్రకమిటి తరుపున సంపూర్ణ మద్దతు ఉంటుందని జేఏసి సెక్రటరీ జెనరల్ పలిశెట్టిదామోదరరావు ప్రకటించారు.

ఈ కార్యక్రమంలో పాల్గోన్న మరోముఖ్యఅతిధి ప్రధానోపాధ్యాయుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుత్తా శ్రీనివాసరావు, ఏపీ జేఏసీ మహిళా విభాగం సెక్రటరీ జెనరల్ శ్రీమతి పొన్నూరు విజయలక్ష్మి, అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నాగరాజు, కన్వీనర్లు వెంకటరమణ, కామేష్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, వివిధ జిల్లాల అధ్యక్షులు, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఎన్.ఐ.డి. ప్రాంగణంలో 12వ జాతీయ చేనేత దినోత్సవ ముందస్తు వేడుకలు

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి సమీపంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (NID) ప్రాంగణంలో 12వ జాతీయ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *