Breaking News

పిల్లల్లో కళా నైపుణ్యం పెంపొందించుటకై త్రెడ్ బ్యాంగిల్స్ తయారీ కార్యక్రమం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్థానిక మహాత్మా గాంధీ రోడ్డులోని ఠాగూర్ గ్రంథాలయంలో ప్రతి ఆదివారం నిర్వహించు చదవటం మాకు ఇష్టం కార్యక్రమంలో భాగంగా ఆదివారం విద్యార్థులకు వినూత్నంగా దారంతో రకరకాల గాజులు తయారు చేయటం నేర్పించబడును. శాఖమూరి హైందవి ప్రత్యేకంగా గుంటూరు నుంచి విచ్చేసి విద్యార్థులకు దారంతో గాజులు తయారు చేసే విధానం నేర్పించి వాటిపైన వివిధ రకాల కుందన్స్ అంటించి అందమైన గాజులుగా తయారు చేశారు. ఆమె మాట్లాడుతూ పిల్లలు చిన్నప్పటి నుంచి చదువుతోపాటు ఎటువంటి వాటిపై శిక్షణ తీసుకోవడం వల్ల వాళ్లు సృజనాత్మకత పెరిగి రంగుల పై అవగాహన కలుగుతుంది. అంతేకాదు ఇలా తయారుచేసిన గాజులను వాళ్ళ స్నేహితుల పుట్టినరోజుకి బహుమతులు గా కూడా ఇచ్చినచో ఆ అనుభూతి ఎంతో తృప్తికరంగా ఉంటుంది అని తెలియజేశారు. విద్యార్థులు సృజనాత్మకతను వెలికి తీసి చేతి పనులపై ఆసక్తి పెంచుతుంది. స్వయం ఉపాధికి ఉపయోగపడే నైపుణ్యంగా మారి చిన్న స్థాయిలో ఆదాయం సమకూర్చే మార్గం కనిపిస్తుంది అని తెలియజేశారు. ఈ కార్యక్రమం గ్రంథాలయ అధికారి కే.రమాదేవి అధ్యక్షతన నిర్వహించబడెను. ఈ కార్యక్రమంలో వివిధ స్కూల్స్ విద్యార్థులు తల్లితండ్రులు పాల్గొన్నారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఎన్.ఐ.డి. ప్రాంగణంలో 12వ జాతీయ చేనేత దినోత్సవ ముందస్తు వేడుకలు

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి సమీపంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (NID) ప్రాంగణంలో 12వ జాతీయ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *