Breaking News

జపాన్ ఓపెన్ సూపర్–750 టైటిల్ విజేత పీవీ సింధుకు శాప్ చైర్మన్ రవి నాయుడు అభినందనలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జూలై 15 నుంచి 20, 2026 వరకు జపాన్‌లోని టోక్యో మెట్రోపాలిటన్ జిమ్నాసియంలో జరిగిన ప్రతిష్ఠాత్మక జపాన్ ఓపెన్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు అద్భుత ప్రదర్శన కనబరిచి విజేతగా నిలవడం పట్ల శాప్ (SAAP) చైర్మన్ రవి నాయుడు హర్షం వ్యక్తం చేస్తూ ఆమెకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఫైనల్ పోరులో జపాన్‌కు చెందిన స్టార్ షట్లర్ అకానె యమగుచిపై అద్భుతమైన ఆటతీరుతో విజయం సాధించి జపాన్ ఓపెన్ సూపర్–750 టైటిల్‌ను కైవసం చేసుకోవడం ఎంతో గర్వకారణమని పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ ప్రతిష్ఠాత్మక టైటిల్‌ను గెలుచుకున్న తొలి భారతీయ మహిళా షట్లర్‌గా పీవీ సింధు చరిత్ర సృష్టించడం భారత క్రీడారంగానికి గొప్ప గౌరవాన్ని తీసుకువచ్చిందని అన్నారు. పీవీ సింధు సాధించిన ఈ విజయం దేశంలోని యువ క్రీడాకారులకు స్ఫూర్తిదాయకమని, ఆమె క్రమశిక్షణ, పట్టుదల, అంకితభావం ప్రతి ఒక్కరికీ ఆదర్శమని రవి నాయుడు కొనియాడారు. రానున్న అంతర్జాతీయ పోటీల్లో కూడా పీవీ సింధు మరిన్ని విజయాలు, పతకాలు సాధించి ఆంధ్రప్రదేశ్‌తో పాటు దేశానికి మరింత కీర్తి ప్రతిష్ఠలు తీసుకురావాలని ఆకాంక్షిస్తూ మరోసారి శుభాకాంక్షలు తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఎన్.ఐ.డి. ప్రాంగణంలో 12వ జాతీయ చేనేత దినోత్సవ ముందస్తు వేడుకలు

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి సమీపంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (NID) ప్రాంగణంలో 12వ జాతీయ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *