Breaking News

విద్యుత్ ఉద్యోగులు, కాంట్రాక్టు కార్మికుల సమస్యలు పరిష్కారానికి క్రుషి చెయ్యాలని MLA కి వినతి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విద్యుత్ ఉద్యోగులు, కాంట్రాక్టు కార్మికులు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎ.పి.విద్యుత్ ట్రేడ్ యూనియన్స్ స్ట్రగుల్ కమిటీ(APVTUSC) ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త దశలవారీ ఆందోళన పోరాటాల్లో భాగంగా జూలై 18, 19 తేదీల్లో ప్రజా ప్రతినిధులకు వినతిపత్రాలు సమర్పించాల్సిన కార్యాచరణలో భాగంగా ఈ రోజు నందిగామ నియోజకవర్గం శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య కి సమస్యలపై వినతిపత్రం ఇవ్వటమైనది ప్రభుత్వం ద్రుష్టికి తీసుకెళ్ళి సమస్యలు పరిష్కారానికి కృషి చెయ్యాలని కోరటమైనది.  ఉద్యోగులందరికి వెంటనే మెరుగైన పిట్ మెంట్ తో PRC ప్రకటించి అమలు చేయాలి, 4DA లు వెంటనే విడుదల చేయాలి, విద్యుత్ కాంట్రాక్టు కార్మికులందరిని సంస్థలో విలీనం చేసి పర్మినెంట్ చేయాలి ,పీస్ రేట్ కార్మికులందరికీ ఉద్యోగ భద్రత కల్పించి కనీస వేతనాలు చెల్లించాలి,పాత పెన్షన్ విధానాన్ని అమలు చెయ్యాలి, JLM కన్వర్షన్స్ అయిన కార్మికులందరికీ ALM ప్రమోషన్లివ్వాలి, 2008 ముందు జాయిన్ ఉద్యోగులందరికీ EPF హయ్యర్ పెన్షన్ అమలుకు తగిన చర్యలు తీసుకోవాలి,సంస్థలో గుర్తింపు యూనియన్ ఎన్నికలు నిర్వహించాలి, విద్యుత్ సంస్థలో ప్రైవేటీకరణ విధానాలు ఆపాలి 24/7 వినియోగదారులకు సేవలందిస్తూ ప్రమాదకర పరిస్థితుల్లో పనిచేస్తున్న విద్యుత్ ఉద్యోగులు సమస్యలు పరిష్కారాం పట్ల యాజమాన్యం నిర్లక్ష్యం వీడి తక్షణమే సమస్యలు పరిష్కరించాలని నాయకులు, కార్మికులు డిమాండ్ చేయటమైనది. ఈ కార్యక్రమంలో యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ & యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ నాయకులు యం.ప్రసన్న కుమార్, CITU మండల కార్యదర్శి కె.గోపాల్ తదితరులు పాల్గొన్నారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఎన్.ఐ.డి. ప్రాంగణంలో 12వ జాతీయ చేనేత దినోత్సవ ముందస్తు వేడుకలు

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి సమీపంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (NID) ప్రాంగణంలో 12వ జాతీయ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *