Breaking News

ఖరీఫ్–2026 పంటల బీమా పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి

-జిల్లా స్థాయి పర్యవేక్షణ కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ డీకే బాలాజి

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ఖరీఫ్–2026 సీజన్‌కు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (పి ఎమ్ ఎఫ్ బి వై) కింద అర్హులైన రైతులందరూ తప్పనిసరిగా నమోదు చేసుకొని పంటల బీమా రక్షణ పొందాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజి సూచించారు.

సోమవారం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన–ఖరీఫ్ 2026 జిల్లా స్థాయి పర్యవేక్షణ కమిటీ సమావేశం జరిగింది. సమావేశంలో వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ జ్యోతి రమణి, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన లక్ష్యాలు, అమలు మార్గదర్శకాలు, ఖరీఫ్–2026లో అమలు విధానాన్ని వివరించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రకృతి వైపరీత్యాల కారణంగా రైతులకు కలిగే పంట నష్టాలను తగ్గించి ఆర్థిక భద్రత కల్పించడమే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ముఖ్య ఉద్దేశ్యమన్నారు.

రుణగ్రహీత రైతులతో పాటు రుణేతర రైతులు, కౌలు రైతులు కూడా స్వచ్ఛందంగా పథకంలో నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. గ్రామస్థాయిలో రైతులకు విస్తృత అవగాహన కల్పించి అర్హులైన ప్రతి రైతు పథకంలో నమోదు అయ్యేలా వ్యవసాయ, రెవెన్యూ, గ్రామ సచివాలయ సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు.

రుణేతర రైతులకు ఈ ఏడాది రైతు స్వీయ ధృవీకరణ (ఫార్మర్ సెల్ఫ్ డిక్లరేషన్) విధానాన్ని ప్రవేశపెట్టడం వల్ల నమోదు ప్రక్రియ మరింత సులభతరం అయిందని తెలిపారు. నమోదు సమయంలో ఆధార్, భూ యాజమాన్య లేదా కౌలు ధ్రువీకరణ పత్రాలు, బ్యాంకు ఖాతా వివరాలు, మొబైల్ నంబర్ తదితర అవసరమైన పత్రాలను సమర్పించాలని సూచించారు.

జిల్లాలో రుణగ్రహీత, రుణేతర రైతుల నమోదు పురోగతిని సమావేశంలో సమీక్షించిన కలెక్టర్, నమోదు ప్రక్రియను వేగవంతం చేసి లక్ష్యాలను పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని నమోదు కేంద్రాల్లో అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు.

అనంతరం జిల్లా కలెక్టర్ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ప్రచార పోస్టర్‌ను ఆవిష్కరించారు. రైతులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకునేలా విస్తృత ప్రచారం నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

సమావేశంలో ఇరిగేషన్ శాఖ ఎస్ఈ గుణకర్, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి జె జ్యోతి, లీడ్ బ్యాంక్ మేనేజర్ రవీంద్రారెడ్డి, జిల్లా గణాంక శాఖ ఏడి కే పద్మజ, డ్రైనేజీ శాఖ ఈఈ కిరణ్ బాబు, కృషి విజ్ఞాన కేంద్ర వ్యవసాయ శాస్త్రవేత్త సుధారాణి, మాజీ ఎంపీపీ కాగిత వెంకటేశ్వరరావు, టాటా ఏఐజీ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధులు, మండల వ్యవసాయ అధికారులు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఎన్.ఐ.డి. ప్రాంగణంలో 12వ జాతీయ చేనేత దినోత్సవ ముందస్తు వేడుకలు

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి సమీపంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (NID) ప్రాంగణంలో 12వ జాతీయ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *