Breaking News

పీజీఆర్ఎస్ ఫిర్యాదుల పరిష్కారంలో అధికారులు ప్రజలకు భరోసాగా నిలవాలి

-పరిష్కరించిన ఫిర్యాదు తిరిగి పునరావృతం కాకూడదు
-ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వహించే అధికారులపై చర్యలు తప్పవు
-సత్వర, నాణ్యమైన పరిష్కారమే ప్రజల సంతృప్తికి కొలమానం
-జిల్లా కలెక్టర్ డా.లక్ష్మీశ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించి, ఫిర్యాదుదారులకు భరోసా కల్పించాలని జిల్లా కలెక్టర్ డా.లక్ష్మీశ ఆదేశించారు.

జిల్లా కలెక్టరేట్‌లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియతో కలిసి కలెక్టర్ ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. అనంతరం వివిధ శాఖల అధికారులతో పెండింగ్, పరిష్కరించిన ఫిర్యాదులపై సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ డా.లక్ష్మీశ మాట్లాడుతూ ఒకసారి పరిష్కారం చూపిన ఫిర్యాదు తిరిగి ప్రారంభమయ్యే పరిస్థితి రాకుండా శాశ్వత పరిష్కారం అందించాలని సూచించారు. ఫిర్యాదుల పరిష్కారం కేవలం నామమాత్రంగా కాకుండా ఫిర్యాదుదారుడు పూర్తిగా సంతృప్తి చెందే విధంగా ఉండాలన్నారు. సమస్యలు వెంటనే పరిష్కరించలేని పరిస్థితుల్లో కారణాలను స్పష్టంగా వివరించి అర్జీదారులకు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రతి అర్జీని పూర్తిగా పరిశీలించి, అవసరమైతే క్షేత్రస్థాయిలో పరిశీలన నిర్వహించి నాణ్యమైన పరిష్కారం అందించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం పీజీఆర్ఎస్ ఫిర్యాదుల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్న కలెక్టర్, ప్రజలు ప్రభుత్వంపై నమ్మకంతో తమ సమస్యలను తీసుకొస్తున్నందున వాటిని తమ సమస్యలుగా భావించి త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం, అలసత్వం ప్రదర్శించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈరోజు నిర్వహించిన పిజిఆర్ఎస్ సమావేశం ద్వారా 251 అర్జీలను స్వీకరించినట్లు కలెక్టర్ తెలిపారు.

పీజీఆర్ఎస్ సేవలపై క్యూ.ఆర్ కోడ్ ద్వారా ప్రజాభిప్రాయం

ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థలో మరింత పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం క్యూ.ఆర్ కోడ్ ఆధారిత ఫీడ్‌బ్యాక్ విధానాన్ని అమలు చేస్తోందని కలెక్టర్ డా.లక్ష్మీశ తెలిపారు. జిల్లా, మండల స్థాయి పీజీఆర్ఎస్ కేంద్రాలు, హెల్ప్‌డెస్క్‌లు, ఫిర్యాదుల కౌంటర్లు, నోటీసు బోర్డులు తదితర ప్రదేశాల్లో క్యూ.ఆర్ కోడ్‌ను ప్రదర్శించనున్నట్లు తెలిపారు. ప్రజలు సేవలు పొందిన వెంటనే తమ మొబైల్ ఫోన్ ద్వారా క్యూ.ఆర్ కోడ్‌ను స్కాన్ చేసి సేవలపై తమ అభిప్రాయాన్ని తెలియజేయవచ్చన్నారు. ఈ విధానం ద్వారా ప్రజల సంతృప్తి స్థాయిని అంచనా వేసి సేవల నాణ్యతను మరింత మెరుగుపరుస్తామని చెప్పారు.

ఈ కార్యక్రమంలో డిఆర్ఓ ఎం.లక్ష్మీనరసింహ, పి జి ఆర్ ఎస్ నోడల్ అధికారి జి.జ్యోతి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఎన్.ఐ.డి. ప్రాంగణంలో 12వ జాతీయ చేనేత దినోత్సవ ముందస్తు వేడుకలు

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి సమీపంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (NID) ప్రాంగణంలో 12వ జాతీయ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *