Breaking News

సమస్యల పరిష్కారమే ప్రజా దర్బార్ లక్ష్యం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజా సమస్యలు నేరుగా తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకే ఎమ్మెల్యే సుజనా చౌదరి నిరంతరం ప్రజా దర్బార్ లను నిర్వహిస్తున్నారని మాజీ కార్పొరేటర్ బుల్లా విజయ్ కుమార్ , టీడీపీ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి పిళ్ళా శ్రీనివాస్, బీజేపీ సీనియర్ నాయకులు పోతిన భేసు కంటేశ్వరుడు అన్నారు.

ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాలతో కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, కూటమి నేతలతో కలిసి భవానిపురం ఎన్డీయే కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజాదర్బార్ లకు విశేష స్పందన లభిస్తోంది. ప్రజలు తమ వినతులను రేషన్ కార్డులు, పింఛన్లు ఇళ్ల స్థలాలు, వైద్య సహాయం వంటి తదితర సమస్యలపై దరఖాస్తు రూపంలో అందజేశారు. వచ్చిన అర్జీలను స్వయంగా పరిశీలించి అక్కడికక్కడే సంబంధిత శాఖల అధికారులతో ఫోన్ లో మాట్లాడి సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు.

రాజకీయాలకతీతంగా, ప్రజాసేవే ధ్యేయంగా, ప్రజా సమస్యలు నేరుగా తెలుసుకుని పరిష్కరిస్తున్నామని
మాజీ కార్పొరేటర్ బుల్లా విజయ్ కుమార్ , టీడీపీ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి పిళ్ళా శ్రీనివాస్, బీజేపీ సీనియర్ నాయకులు పోతిన భేసు కంటేశ్వరుడు అన్నారు. టీడీపీ సీనియర్ నాయకులు కామ దేవరాజ్, గుజ్జారి అమర్ బాబు, ఆకారపు విజయ కుమారి, ప్రభు చరణ్ తదితరులు పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఎన్.ఐ.డి. ప్రాంగణంలో 12వ జాతీయ చేనేత దినోత్సవ ముందస్తు వేడుకలు

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి సమీపంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (NID) ప్రాంగణంలో 12వ జాతీయ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *