విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలోని అన్ని గ్రామాల ప్రజలకు సమగ్ర తాగునీరు సరఫరా చేసే వేలాది మంది కార్మికుల హక్కుల, సమస్యలు పట్టించుకునే నాధుడు లేడని కార్మికులు ప్రభుత్వానికి మొరపెట్టుకున్నారు. సోమవారం విజయవాడ ధర్నా చౌక్ లో AP RWS కార్మికుల యూనియన్ ఆధ్వర్యంలో రెండు రోజుల నిరసన ధర్నా ప్రశ్నించారు. ఈ ధర్మాలలో వివిధ రాజకీయ పార్టీలు నాయకులు పాల్గొని కార్మికుల డిమాండ్లకు మద్దతు ప్రకటించారు. ధర్నాకు దళిత బహుజన ఫ్రంట్ జాతీయ ప్రధాన కార్యదర్శి, యూనియన్ ముఖ్య సలహాదారు మేళం భాగ్య రావు అధ్యక్షత వహించారు. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖామంత్రి పవన్ కళ్యాణ్ వీరికి అపాయింట్మెంట్ ఇచ్చి వెంటనే సమస్యలు పరిష్కరించాలని నేతలు డిమాండ్ చేశారు. . కాంట్రాక్టర్ల వ్యవస్థ రద్దు చేసి ఈ కార్మికులకు జీతాలు ఇవ్వడం ప్రభుత్వ బాధ్యతగా తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ వప్పందం ప్రకారం వీరికి కనీస వేతనం నెలకు 21 వేల రూపాయలు ఇవ్వాల్సి ఉండగా, అన్ని జిల్లాలలో కేవలం నెలకు 6 వేలు కూడా ఇవ్వటం లేదనీ కార్మికులు ఆవేదన చేశారు. వీరికి ESI, IPF వంటి కనీస కార్మిక భద్రత సంక్షేమ అవకాశాలుకూడా కల్పించాలని నాయకులు డిమాండ్ చేశారు. కాంట్రాక్టర్ల వద్ద బానిస కూలీలుగా, ప్రభుత్వానికి పట్టని పరాయి లేబర్ గా వీరి జీవితాలు దుర్బలంగా మారాయనీ ధర్మాలలో కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు.. వీరి కనీస హక్కుల పరిరక్షణ కోసం విజయవాడ ధర్నా చౌక్ లో జరిగిన ధర్మాలో CPM పార్టీ జాతీయ నాయకురాలు డీ.రమాదేవి, CPI రాష్ట్ర కార్యవర్గదర్శి సభ్యులు, దోణెపూడి శంకర్, YSRCP రాష్ట్ర నాయకులు వెల్లంపల్లి శ్రీనివాస్ , మల్లాది విష్ణు, దేవినేని అవినాష్, కొమ్మూరి కనకరావు, రవిచంద్ర, విజయవాడ మాజీ డిప్యూటీ మేయర్ సిరిపురపు గ్రీటన్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొలనుకొండ శివాజీ, KVPS రాష్ట్ర కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి , DHPS రాష్ట్ర కార్యదర్శి కరవది సుబ్బారావు, RWS కార్మిక యూనియన్ రాష్ట్ర నాయకులు సాథులూరి రామాంజనేయులు, రాయుడు శ్రీనివాస్, దియా చినకొండయ్య, CH. ప్రసాదు బాబు, పి. చంద్ర శేఖర్, గోపాల్. జోగారావు, లక్ష్మీపతి, పోశయ్య, K .తాతాజీ,GV .రామకృష్ణ, I.కృష్ణ, యు.రమణ శ్రీరాములు తదితరులు పాల్గొని ప్రసంగించారు.
Prajavartha Online Telugu News