Breaking News

104 అంబులెన్సుల రూపురేఖల్లో మార్పులు

-ప‌నుల‌కు 2 నెలల వరకు సమయం
-అందుబాటులో ఉండాల్సిన వాహనాల తగ్గింపు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో 104 సంచార వైద్యశాల(మొబైల్ మెడికల్ యూనిట్స్‌-యంయంయు) ద్వారా ప్ర‌తి వ్య‌క్తికి 41 వైద్య నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు చేయు నిమిత్తం ఈ వాహ‌నాల్లో త‌గు ఏర్పాట్లు చేయ‌డానికి ప్ర‌భుత్వం అనుమ‌తించింది. 904 వాహ‌నాల్లో ఇందుకు అవ‌స‌ర‌మైన ప‌రిక‌రాల ఏర్పాటు, అంత‌ర్గ‌త మార్పులు, రీబ్రాండింగ్ చేయ‌డానికి విడ‌త‌లవారీగా రెండు నెల‌ల స‌మ‌యం ప‌డుతుంది. ఈ కార‌ణంగా వాహ‌నాల ల‌భ్య‌త కొంతమేర త‌గ్గే అవ‌కాశ‌ముంది.

రెండు నెల‌ల కాలంలో ఈ మార్పులు పూర్తి చేయ‌డానికి వైద్యారోగ్య శాఖా మంత్రి శ్రీ స‌త్య‌కుమార్ యాద‌వ్ ఆమోదం తెలిపారు. అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లో స‌ర్వీసులు అందించేందుకు ఏర్పాటు చేసిన 34 బ్యాక‌ప్ వాహ‌నాల‌ను స‌ద్వినియోగం చేసుకుంటూ, మార్పుల కోసం స‌రైన ప్ర‌ణాళిక‌లు రూపొందించి ప్ర‌జ‌ల‌కు ఇబ్బంది క‌ల‌గకుండా చూడాల‌ని మంత్రి అధికారుల‌ను ఆదేశించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఎన్.ఐ.డి. ప్రాంగణంలో 12వ జాతీయ చేనేత దినోత్సవ ముందస్తు వేడుకలు

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి సమీపంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (NID) ప్రాంగణంలో 12వ జాతీయ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *