కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
కొవ్వూరు నియోజకవర్గం- 54 (ఎస్సి ) పరిధిలో నవంబర్ 20, 21 తేదీలలో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమంలో 987 క్లెయిమ్స్ రావడం జరిగిందని కొవ్వూరు నియోజకవర్గ సహాయ ఎన్నికల రిజిస్ట్రేషన్ అధికారి బి. నాగరాజు నాయక్ లు ఆదివారం ఒక ప్రకటన లో తెలిపారు. ఓటు లేనివారు, 1.1.2022 నాటికి 18 సం. ములు నిండే వారు కొత్తగా ఓటర్ల కోసం నమోదు చేసుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అవకాశం కల్పించిండం జరిగిందని తహసీల్దార్ నాగరాజు అన్నారు. ఇందుకోసం కొవ్వూరు నియోజకవర్గ పరిధిలోని 181 ఎన్నికల బూత్ లెవెల్ అధికారులు సంబంధించిన పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు శని , ఆది వారాల్లో అందుబాటులో ఉండడం జరిగిందన్నారు. ఫారం-6 కొత్త ఓటర్లు 18-19 మధ్య ఉన్నవారు 357 మంది, 19 సం. ములు పైబడిన వారు 430 మంది కొత్తగా దరఖాస్తు చేసుకున్నారని నాగరాజు తెలిపారు. అదేవిధంగా మార్పులు చేర్పులు లకు, 01.01.2022 నాటికి 18 ఏళ్లు నిండే ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకునేందుకు ప్రత్యేక ఓటరు నమోదు తేదీల్లో బీఎల్‌వోలు పోలింగ్ కేంద్రాల వద్ద సంబంధిత అన్ని పత్రాలతో అందుబాటులో ఉన్నారని తెలిపారు. కొత్తగా ఓటు నమోదుతో పాటు తొలగింపు, మార్పులు, చేర్పులకు సంబంధించి దరఖాస్తులను ఫారం- 6ఏ, 7, 8, 8ఏ ,ఆయా కేంద్రాల వద్ద స్వీకరించామని, ఫారం-7(ఓటు తొలగింపు కై) 73 మంది, ఫారం-8 (పేరు, వయస్సు మార్పు లకై) 75, ఫారం- 8ఏ (అడ్రస్ మార్పు తదితరలకై) 47 మంది దరఖాస్తు చేసుకున్నారని ఆయన పేర్కొన్నారు. ఇంకా ఓటు హక్కును పొందిన వారి కొరకు ప్రజల్లో ఓటరు నమోదుపై సంబంధిత సిబ్బంది, వాలంటీర్లు లు విస్తృత ప్రచారం చేయాలని , ఇది నిరంతర ప్రక్రియ అని తాహసిల్దార్ బి.నాగరాజు నాయక్ స్పష్టం చేశారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కార్యక్రమం హక్కు కై దరఖాస్తు చేసుకోగలరని, ఇది నిరంతర ప్రక్రియ అని ఆయన తెలిపారు. దరఖాస్తులు పరిశీలించి, జనవరి 15న ఓటరు తుది జాబితా ప్రకటిస్తామని తెలిపారు.