పెనుమంట్ర, నేటి పత్రిక ప్రజావార్త :
పెనుమంట్ర మండలము మల్లిపూడి గ్రామానికి చెందిన గుడిమెట్ల సీతా మహా లక్ష్మి తన విజయగాధ పై మాట్లాడుతూ, తన తోటి మహిళలతో కూడి దుర్గాదేవి గ్రూప్ ఏర్పాటు చేసుకొన్నామన్నారు. బ్యాంక్ రుణం పది లక్షలు మేమందరం కలసి రూపాయలు తీసుకోవడం జరిగిందన్నారు.
నావాటా గా వొచ్చిన రూ.ఒక లక్ష, వై.ఎస్.ఆర్ ఆసరా పధకం ద్వా రా 25 వేల రూపాయలు వచ్చాయని, స్త్రీ నిధి ద్వారా యాభై వేలు లోను వచ్చింద న్నారు. మొత్తం నాకు 175000/-, రూపాయలు డ్వాక్రా సభ్యురాలిగా వచ్చాయన్నారు. ఈ సొమ్ము తో వ్యాపారం నత్తా రామేశ్వరం రోడ్డు లో సోమేశ్వర డ్రై ఫ్రూట్& పికెల్స్, ఫ్రూట్ జ్యూస్, చెరకు రసం, షాప్ పెట్టుకొని జీవనం గడుపుతున్నాను. వ్యాపారం లో లాభాలు గణించి మా కుటుంబాన్ని పోషించుకుంటున్నాను. ఈ వ్యాపారం పెట్టు కోవడానికి అధికారులు చాలా సహకరించారన్నారు. ఆసరా పధకం మహిళల పాలిట వరం గా మారిందన్నారు. ఆసరా పధకం వల్ల ఎన్నో పేద కుటుం బాల్లో వెలుగులు నిలిపిందన్నా రు. పేద కుటుంబాల్లోని చదువుకోని మహిళల పేరిట సంక్షేమ పధకాలు రావడం వల్ల మహిళలే వ్యాపారాలు పెట్టుకొని కుటుంబ పోషణ కి ఆధారం గా నిలుస్తూ మహిళల కళ్ళల్లో ఆనందం వెళ్లి విరుస్తోందన్నారు.
ప్రజలు,మహిళలు జగనన్న పై నమ్మకం తో 151 స్థానాల్లో గెలి పించి ముఖ్య మంత్రి ని చేసార ని, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుం టు సంక్షేమ పథకాలు మహిళ లు పేరునే ముఖ్యమంత్రి వై. ఎస్. జగన్ మోహన్ రెడ్డి అందించడం జరుగుతోందన్నారు. ప్రతీ కుటుంబానికి మహిళలే కుటుంబ యజమానులుగా, ప్రధాన ఆధారంగా ఉండాలని, మహిళా సాధికారత దిశగా అడుగులు వెయ్యలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆశయము. వైఎస్సార్ ఆసరా రెండో విడత సంబరాలు దసరా పండుగ రోజుల్లో అందచేసే క్రమంలో డ్వాక్రా అక్క చెల్లెమ్మల ఆనం దాన్ని పంచుకొంటూ వేడుకలు వాళ్ళ మధ్య జరుపుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలు వాళ్ళ కుటుంబాల ఆర్ధిక అభివృద్ధి కి వినియోగించుకుంటున్నారు. తండ్రికి తగ్గ తనయుడిగా వై ఎస్ రాజశేఖరరెడ్డి ఒక అడుగు వేస్తే తాను రెండడుగులు వేస్తూ, జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథ కాలు అమలు చేయడం జరు గుతోంది. మహిళల పేరిట పధకాలు ఏర్పాటు చేసి పేదకుటుంబాలు ఆర్థికముగా నీలాదోక్కు కునే విధంగా జగనన్న చర్యలు తీసుకుంటున్నారన్నారు. వైఎస్సార్ ఆసరా ఫేజ్ – II కింద ఆచంట నియోజకవర్గంలోని డ్వాక్రా గ్రూపు అక్కచెల్లెమ్మలకు రూ.49.19 కోట్ల రూపాయలు మేర పంపిణీ చేయడం జరిగింది.
పెనుమంట్ర మండల పరిధిలోని 1163 స్వయం సహాయక సంఘాల 10,467 మంది మహిళల ఖాతాకు రూ.11 కోట్ల 07 లక్షలు అందచేశారన్నారు. వైఎస్సార్ ఆసరా రెండో విడత పంపిణీ కార్యక్రమంలో భాగంగా మండలం లో 15 గ్రామాల్లోని మహిళల బ్యాంకు ఖాతాలో కి జమచేసారన్నారు. మల్లిపూడి గ్రామంలో 52 గ్రూపుల లోని 468 మందికి రూ.56.81 లక్షలు పంపిణీ చేశారని గ్రామ సమాఖ్య సభ్యురాలు లక్ష్మి తెలిపి, రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞత వ్యక్తం చేశారు.