-రవాణా శాఖ ఉద్యోగుల ప్రతి సమస్య పరిష్కరించేందుకు కృషి చేస్తాం…
-జోనల్ అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికైన రాజుబాబు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రవాణాశాఖ ఉద్యోగుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ రాష్ట్ర సంఘం దృష్టికి అధికారుల దృష్టికి తీసుకువెళ్లి వాటిని పరిష్కరించడంలో జోనల్ అధ్యక్షుడు రాజుబాబు చురుకైన పాత్ర పోషించేవాడని రవాణాశాఖ నాన్-టెక్నికల్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డి మణికుమార్ అన్నారు. స్థానిక బందరు రోడ్డు లోని డిటిసి కార్యాలయం ప్రాంగణంలో ట్రాన్స్ పోర్ట్ భవనం నందు ఆదివారంనాడు రవాణాశాఖ ఉద్యోగుల సంఘ జోన్2 కార్యవర్గ సమావేశం ఎన్నికలు నిర్వహించారు. ఈ సందర్భంగా జోన్2 నూతన కార్యవర్గాన్ని ఉద్యోగులు ఎన్నుకున్నారు. మొత్తం 9 పదవులకు 9 నామినేషన్లు మాత్రమే దాఖలు కావడంతో ఏకగ్రీవమయ్యాయని ఎన్నికల అధికారి, జోన్1 అధ్యక్షుడు ఎ వి కృష్ణ మోహన్ ప్రకటించారు. సహాయ ఎన్నికల అధికారిగా, ఎస్ టి ఎ యూనిట్ కార్యదర్శి సిహెచ్ పైడిరాజు, ఎన్నికల పరిశీలకుడుగా రాష్ట్ర సంఘం సంయుక్త కార్యదర్శి కె ఆర్ కె వర్మ వ్యవహరించారు.
రవాణాశాఖ ఉద్యోగుల సంఘం జోన్2 నూతన కార్యవర్గం అధ్యక్షుడిగా జిల్లా రవాణాశాఖకు చెందిన యం రాజుబాబును, కార్యదర్శిగా పి విజయ (కృష్ణా జిల్లా), కోశాధికారిగా కెవివి నాగ మురళి (కృష్ణా జిల్లా), అసోసియేట్ అధ్యక్షురాలుగా జి ఉష సుందరి (పశ్చిమగోదావరి జిల్లా), ఉపాధ్యక్షులుగా డి రామ్మూర్తి (తూర్పుగోదావరి జిల్లా), నాగ శంకర్ (తూర్పుగోదావరి జిల్లా), కార్యనిర్వహణ కార్యదర్శిగా బి సుకుమార్ (పశ్చిమగోదావరి జిల్లా), సంయుక్త కార్యదర్శిలుగా కె సతీష్ (తూర్పుగోదావరి జిల్లా), బి. మధుసూదనరావు (పశ్చిమగోదావరి జిల్లా) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అదే రోజు సాయంత్రం నూతన కార్యవర్గ సభ్యులతో ప్రమాణస్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిధులుగా విచ్చేసిన రాష్ట్ర అధ్యక్షుడు డి మణికుమార్ మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యల పట్ల నిరంతర పోరాడటం చేస్తూ ఉద్యోగుల సమస్యలను పరిష్కారానికి కృషి చేస్తున్న రాజుబాబును రెండోవసారి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం అభినందనీయమన్నారు. తూర్పు పశ్చిమగోదావరి కృష్ణా జిల్లాలకు చెందిన దాదాపు 150 మంది ఉద్యోగులను ఏకతాటిపైకి తీసుకువచ్చి వారి సమస్యలను పరిష్కరిస్తూ తనదైన ముద్ర వేసుకున్నారన్నారు. శాఖఫరమైన సమస్యలే కాక ఉద్యోగుల వ్యక్తిగత సమస్యలను కూడా తన సమస్యలుగా భావించి వాటిని పరిష్కరించి ఉద్యోగుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని నిలబెట్టుకోవడంతో రాజుబాబును తిరిగి అధ్యక్ష పదవికి పోటీ లేకుండా ఎన్నుకోవడం జరిగిందన్నారు. రాష్ట్ర సంఘం పక్షాన జోన్2 నూతన కార్యవర్గానికి అభినందనలు తెలియజేసామన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర సంఘం స్థాయిలో ఉన్న ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర సంఘంన్ని కోరాడమే కాకుండా సమస్య పరిష్కారం అయ్యేవరకు రాజుబాబు వదిలిపెట్టేవాడు కాదని ఆయన గుర్తుచేశారు. పశ్చిమ కృష్ణా ఏపీ ఎన్జీఓస్ అసోసియేషన్ లో కూడా జిల్లా ఉపాధ్యక్షుడుగా రాజుబాబు చురుకైన పాత్ర వహిస్తున్నాడని ఆయన అన్నారు. ఉద్యోగుల మన్ననలు పొందాడు కాబట్టే రెండోవసారి జోనల్ అధ్యక్షుడు పగ్గాలు చేపట్టే అవకాశం ఉద్యోగులు ఇచ్చారన్నారు. నూతన అధ్యక్షుడు యం రాజుబాబు మాట్లాడుతూ సమాజంలో పదిమందికి ఉపయోగపడుతుండడంతో పాటు ఉద్యోగుల సమస్యలను పరిష్కరించగలిగిన స్థానంలో నిలబడేలా జన్మనిచ్చిన తల్లిదండ్రులకు ఎన్ని జన్మలకైనా రుణపడి ఉంటామని రాజుబాబు అన్నారు. జోన్2 సంఘానికి రెండోవసారి అధ్యక్షుడుగా ఎంపికచేయడంతో తన బాధ్యత మరెంత పెరిగిందన్నారు. తనకు అమూల్యమైన సలహాలు సూచనలు అందిస్తూ అండగా నిలుస్తున్న ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని, ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తూ మరింత సేవా దృక్పథంతో పనిచేసేందుకు అడుగులు ముందుకు వస్తానని రాజుబాబు అన్నారు.
నూతనం గా ఎన్నికైన కార్యవర్గానికి రవాణాశాఖ అధికారులు జగదీశ్వర్ రాజు, ఏవి సారధి, ఎం పద్మావతి, జోన్1 అధ్యక్షుడు ఎ వి కృష్ణ మోహన్, జోన్3 కార్యదర్శి యం శ్రీనివాసులు రావు,రాష్ట్ర సంఘం మాజీ అధ్యక్షులు జై రాజారావు, కె వి సుబ్బారావు, ఏపీఎన్జీవో నేతలు జె స్వామి, జె సంపత్ కుమార్, పి వి రమణ, వి వి ప్రసాద్, నాగరాజు, సిపియస్ ఉద్యోగుల రాష్ట్ర అధ్యక్షుడు సీఎం దాసు, రవాణాశాఖ అధికారులు ఉద్యోగులు అభినందనలు తెలియజేసి గజమాలతో సత్కరించారు.