Breaking News

మెరుగైన వైద్యం కోసం ఎల్ ఓ సీ పత్రాలు అందజేత

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎమ్మెల్యే సుజనా చౌదరి ప్రజల ఆరోగ్య భద్రతే లక్ష్యంగా నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలను అందించేందుకు
లెటర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్. ఓ. సి) లను జారీ చేస్తున్నారు. ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాలతో కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ మాజీ కార్పొరేటర్ బుల్లా విజయ్ కుమార్ కూటమి నేతలతో కలిసి భవానిపురం, ఎన్డీయే కార్యాలయంలో బాధితులకు ఎల్ ఓ సీ పత్రాలను అందజేశారు. 48 వ డివిజన్, చిట్టి నగర్ కు చెందిన అక్కిశెట్టి మురళి (63) హృద్రోగంతో బాధపడుతూ వైద్యం సాయం కోసం దరఖాస్తు చేసుకోగా మంజూరైన రూ 5 లక్షల విలువైన ఎల్ ఓ సీ ను అందజేశారు.

35 వ డివిజన్, డేవిడ్ స్ట్రీట్ కు చెందిన జూపూడి జ్యోతి (44) అడెనోమయోసిస్, గర్భాశయ సంబంధిత వ్యాధితో బాధపడుతూ మెరుగైన వైద్యం కోసం ఎల్ ఓ సీ కొరకు దరఖాస్తు చేసుకోగా మంజూరైన రూ 1 లక్ష 84 వేల విలువైన ఎల్ ఓ సీ ను అందజేశారు. త్వరితగతిన స్పందించి
ఎల్ ఓ సీ ను అందజేసిన ఎమ్మెల్యే సుజనా చౌదరి కు బాధితుల కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. కూటమి నేతలు పోతిన భేసు కంటేశ్వరుడు,దేవిన హరి ప్రసాద్, చొక్కర పాపారావు, ప్రముఖ న్యాయవాది చాట్ల రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఎన్.ఐ.డి. ప్రాంగణంలో 12వ జాతీయ చేనేత దినోత్సవ ముందస్తు వేడుకలు

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి సమీపంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (NID) ప్రాంగణంలో 12వ జాతీయ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *