విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక అవుట్లెట్ల ద్వారా తక్కువ ధరకే బియ్యం విక్రయాలు చేస్తున్నట్లు ఏపీ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గుమ్మడి వెంకటేశ్వరరావు తెలిపారు. గురువారం గాంధీనగర్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ హాలులో జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కిలో స్టీమ్ రైస్ ధర రూ.52 మాత్రమే. కిలో రా రైస్ ధర రూ.50కే ఇస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 130 రైతు బజార్లలో ప్రత్యేక బియ్యం కౌంటర్లు ఏర్పాటు చేసి, 500కు పైగా రైస్ మిల్లుల వద్ద కూడా నేరుగా సబ్సిడీ బియ్యం విక్రయిస్తామన్నారు. నిత్యావసరాల ధరల నియంత్రణకు మిల్లర్ల సంఘం సహకారం ఉంటుదని, ప్రజలందరూ ఈ ప్రత్యేక సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News