Breaking News

61వ డివిజన్‌లో ఉత్సాహంగా సాగిన “ఇంటింటికి తెలుగుదేశం” కార్యక్రమం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 61వ డివిజన్ పాత పాయకాపురం వంగవీటి మోహన రంగా విగ్రహం వద్ద నుండి శుక్రవారం తెలుగుదేశం పార్టీ యువ నాయకులు బొండా సిద్ధార్థ ఆధ్వర్యంలో “ఇంటింటికి తెలుగుదేశం” కార్యక్రమం ఉత్సాహంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బొండా సిద్ధార్థ  ఇంటింటికి వెళ్లి ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ, కూటమి ప్రభుత్వం గత రెండేళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తోందని, ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సేవలు చేరేలా కృషి చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం ప్రజల సమస్యలు, సూచనలు తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు, ప్రజా సంక్షేమ లక్ష్యాలను ప్రజలకు వివరిస్తూ పార్టీ శ్రేణులు మరింత చురుకుగా ప్రజల్లోకి వెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో NDA నాయకులు కార్యకర్తలు, అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఎన్.ఐ.డి. ప్రాంగణంలో 12వ జాతీయ చేనేత దినోత్సవ ముందస్తు వేడుకలు

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి సమీపంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (NID) ప్రాంగణంలో 12వ జాతీయ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *