Breaking News

పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రజా దర్బార్

-కూటమి నేతలతో కలిసి వినతులు స్వీకరించిన టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు బుద్ధా వెంకన్న 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
భవానిపురం ,ఎన్డీయే కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రజా దర్బార్ లో టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు బుద్ధా వెంకన్న, పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, కూటమి నేతలతో కలిసి వినతులు స్వీకరించారు. ప్రజల నుండి అర్జీలు స్వీకరించి బాధితుల సమస్యలను ఓపికగా విని వాటిని తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

ఇళ్ల స్థలాలు, పింఛన్లు, వైద్య సహాయం కోసం వచ్చిన వినతులను స్వీకరించారు.. వచ్చిన ప్రతి అర్జీని పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. బాధితులకు కూటమి ప్రభుత్వం తరపున అండగా ఉంటామని బుద్ధా వెంకన్న స్పష్టం చేశారు. 54 డివిజన్, వించి పేటకు చెందిన కమల్ ఖాన్ (51) హృద్రోగంతో బాధపడుతూ మెరుగైన వైద్యం కోసం దరఖాస్తు చేసుకోగా మంజూరైన రూ 6 లక్షల 50 వేల విలువైన ఎల్ ఓ సీ ను బుద్ధా వెంకన్న కూటమి నేతలతో కలిసి అందజేశారు. కూటమి నేతలు గుర్రం కొండ, కామ దేవరాజ్, మాజీ కార్పొరేటర్లు యేదుపాటి రామయ్య, పత్తి నాగేశ్వరరావు, తిరుపతి అనూష, తిరుపతి సురేష్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఎన్.ఐ.డి. ప్రాంగణంలో 12వ జాతీయ చేనేత దినోత్సవ ముందస్తు వేడుకలు

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి సమీపంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (NID) ప్రాంగణంలో 12వ జాతీయ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *