Breaking News

చంద్రబాబు దిగజారుడు రాజకీయాలను రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు : ఎమ్మెల్యే మల్లాది విష్ణు

-ముఖ్యమంత్రి గారిపై ప్రతిపక్ష నేత వ్యాఖ్యలు బాధాకరం
-చంద్రబాబు ప్లాన్ ప్రకారం రెచ్చగొడుతున్నారు
-వైఎస్సార్ సీపీ ప్రభుత్వానికి మహిళలంటే ఎంతో గౌరవం
-సీఎం వైఎస్ జగన్‌ మహిళా పక్షపాతి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సీఎం జగన్మోహన్ రెడ్డి పై ప్రతిపక్ష నేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు బాధాకరమని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిపై చంద్రబాబునాయుడు చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ ముత్యాలంపాడు గవర్నమెంట్ ప్రెస్ వద్ద వైఎస్సార్ సీపీ శ్రేణులు శాంతియుత నిరసనలు తెలియజేశారు. చంద్రబాబు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు తో పాటు డిప్యూటీ మేయర్ అవుతు శైలజారెడ్డి సహా వైసీసీ కార్పొరేటర్లు, శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గడిచిన రెండున్నరేళ్లల్లో జరిగిన ప్రతి ఎన్నికలోనూ టీడీపీ ఘోర పరాజయం పాలవడంతో పాటు రాష్ట్రంలో పూర్తిగా రాజకీయ ఉనికి కోల్పోయిందని మల్లాది విష్ణు అన్నారు. మళ్లీ అధికారంలోకి రాలేమన్న భయంతో చంద్రబాబు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. శాసనసభ వేదికగా చంద్రబాబు కుటుంబ సభ్యుల గూర్చి కానీ, నారా భువనేశ్వరి  గూర్చి కానీ ఏ ఒక్క సభ్యుడు పల్లెత్తు మాట మాట్లాడలేదని స్పష్టం చేశారు. కానీ భార్యను, శాసనసభను, వరదలను అడ్డం పెట్టుకుని చంద్రబాబు చేస్తున్న దిగజారుడు రాజకీయాలను రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారన్నారు. సానుభూతి కోసం చివరకు కుటుంబాన్ని కూడా ప్రతిపక్ష నేత రోడ్డుపైకి లాగుతున్నారని దుయ్యబట్టారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశానని గొప్పులు చెప్పుకునే వ్కక్తి..  శాసనసభను కౌరవసభగా మాట్లాడటం అత్యంత బాధాకరమన్నారు. పైగా ఏ ముఖం పెట్టుకుని 12 గంటలకు దీక్షకు సిద్ధమయ్యారో ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు.

మహిళలంటే సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఎంతో గౌరవమని మల్లాది విష్ణు వెల్లడించారు. అన్ని రంగాలలో మహిళలకు అత్యధిక ప్రాధాన్యతను ఇవ్వడమే కాకుండా.. మహిళలకు 50 శాతం రాజకీయ రిజర్వేషన్లు క‌ల్పించిన ఘనత వైఎస్సార్ సీపీ ప్రభుత్వానికే చెల్లిందన్నారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా సంక్షేమ కార్యక్రమాలతో అనతికాలంలోనే ప్రజల హృదయాలను గెలుచుకున్న సీఎం జగన్మోహన్ రెడ్డి  పదికాలాల పాటు చల్లగా ఉండాలని యావత్ రాష్ట్ర ప్రజలు కోరుకుంటుంటే చూసి చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. అధికారం లేకపోయేసరికి పిచ్చిపట్టినట్లుగా చంద్రబాబు ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. ఆవేశంలో ప్రతీసారి దిగజారి మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు వెంటనే ముఖ్యమంత్రివర్యులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు పెనుమత్స శిరీష, జానారెడ్డి, ఉమ్మడి రమాదేవి, శర్వాణీ మూర్తి, బాలి గోవింద్, కుక్కల అనిత, కొండాయిగుంట మల్లీశ్వరి, ఇసరపు దేవి, మోదుగుల తిరుపతమ్మ, యర్రగొర్ల తిరుపతమ్మ, గాంధీ కోఆపరేటివ్ బ్యాంక్ డైరక్టర్ భోగాది మురళి, వైఎస్సార్ సీపీ డివిజన్ ఇంఛార్జిలు ఆత్మకూరు సురేష్, అంగిరేకుల నాగేశ్వరరావు, గుండె సుందర్ పాల్, బొందిలి కార్పొరేషన్ డైరక్టర్ శైలజా భాయ్, నాగవంశీ కార్పొరేషన్ డైరక్టర్ కాళ్ల ఆదినారాయణ, అర్బన్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరక్టర్ కుదిరిళ్ల వీరబాబు, నాయకులు అలంపూర్ విజయ్, కంబం కొండలరావు, వైసీపీ శ్రేణులు, అభిమానులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రధాని మోదీ ప్రపంచం మెచ్చిన నాయకుడు

-అభివృద్ధి, సంక్షేమం, సంస్కరణలు, సుపరిపాలన మోదీ నినాదాలు -ఒకేరోజున రూ.2,08,548 కోట్ల పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఒక రికార్డ్ -ఇంతటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *