Breaking News

ఏఈఈ నియామక పరీక్షా కేంద్రాన్ని సందర్శించిన ఏపీసీపీడీసీఎల్ డైరెక్టర్ టీవీఎస్ఎన్ మూర్తి

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఏపీసీపీడీసీఎల్ డైరెక్టర్ (ప్రాజెక్ట్స్ & హెచ్‌ఆర్) టీవీఎస్ఎన్ మూర్తి వట్టిచెరుకూరు మండలం పుల్లడిగుంట గ్రామంలోని మలినేని ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా పరీక్షా కేంద్రంలో అభ్యర్థులకు కల్పించిన సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్లు, పరీక్ష నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను డైరెక్టర్ పరిశీలించారు.పరీక్షలు పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. అభ్యర్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.ఈ సందర్శనలో CRDA సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ చల్లా రమేష్, టెక్నికల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ హరిబాబు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

శ్రీ కృష్ణాష్టమి వేడుకలలో దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా తూర్పు నియోజకవర్గంలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *