-అక్టోబర్ 3, 4న రాష్ట్రస్థాయి అడ్వకేట్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రస్థాయి న్యాయవాదుల షటిల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్–2026కు రాష్ట్ర రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని ది బెజవాడ బార్ అసోసియేషన్ (The Bezwada Bar Association) ప్రతినిధులు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు. విజయవాడలోని చెన్నుపాటి రామకోటయ్య మున్సిపల్ కార్పొరేషన్ ఇండోర్ స్టేడియంలో అక్టోబర్ 3, 4 తేదీల్లో నిర్వహించనున్న టోర్నమెంట్ వివరాలను మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా బార్ కౌన్సిల్ సభ్యులు చలసాని అజయ్ బాబు, బెజవాడ బార్ ప్రధాన కార్యదర్శి V.కిరణ్, ఈసీ T.కిరణ్, స్పోర్ట్స్ సెక్రటరీ జి రామ్ తేజ , ఆర్గనైజర్ రైసా తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News