Breaking News

కృష్ణా జిల్లాలో ఈడుపుగల్లు పాఠశాలలను సందర్శించిన విద్యాశాఖ ఉన్నతాధికారులు

-కాసేపు ఉపాధ్యాయుడిగా మారిన విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జె. శ్యామలరావు IAS
-చిన్నారులతో సరదాగా ముచ్చటిస్తూ చదువు చెప్పిన విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ
-పాల్గొన్న పాఠశాల విద్య డైరెక్టర్ శ్రీమతి ఎ.తమీమ్ అన్సారియా IAS, సమగ్ర శిక్ష ఎస్పీడీ  బి.శ్రీనివాసరావు IAS

కంకిపాడు, నేటి పత్రిక ప్రజావార్త :
విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రభుత్వం ఎంతో పెట్టుబడి పెడుతోంది.. వారిని అత్యుత్తమ పౌరులుగా తీర్చిదిద్ది పురోగతి బాటలో నడిపించాల్సిన గురుతర బాధ్యత ఉపాధ్యాయులపైనే ఉందని విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జె. శ్యామలరావు, IAS అన్నారు.
శనివారం కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఈడుపుగల్లు గ్రామంలోని ఆదర్శ ప్రాథమిక పాఠశాల, పీఎంశ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జె.శ్యామలరావు IAS.,  సందర్శించారు. ఈ పర్యటనలో విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జె. శ్యామలరావు IAS తో పాటు పాఠశాల విద్య డైరెక్టర్ ఎ. తమీమ్ అన్సారియా IAS, , సమగ్ర శిక్ష స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ బి. శ్రీనివాసరావు IAS తరగతి గదుల్లోకి వెళ్లి విద్యార్థులతో సమయం గడిపారు.
తొలుత ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో అందుబాటులో ఉన్న ‘ఎఫ్ఎల్ఎన్ జాదూయి పిఠారా’ కిట్‌ను ప్రిన్సిపల్ సెక్రటరీ స్వయంగా పరిశీలించి, విద్యార్థులు దానిని ఎలా వినియోగిస్తున్నారో గమనించారు
ఈ సందర్భంగా చిన్నారులతో ఆప్యాయంగా ముచ్చటిస్తూ తెలుగు, ఆంగ్లం, గణితం పాఠ్యాంశాల్లో అక్షరాలను గుర్తించడం, రాయడం, చదివించడం వంటి కృత్యాలు స్వయంగా చేయించి, చిన్నారులను అభినందించారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా విద్యార్థుల కోసం వండిన భోజనం, మిల్లెట్ చిక్కీ రుచి చూసి బాగుందని మెచ్చుకున్నారు. ‘సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్’లో అందజేసిన బ్యాగుతో పాటు అసెస్మెంట్స్ బుక్స్ పరిశీలించి, ఉపాధ్యాయుల పనితీరు గురించి అడిగి తెలుసుకున్నారు. మూడో తరగతి విద్యార్థిని హారిక గీసిన బొమ్మలను చూసి మురిసిపోయి ప్రత్యేకంగా ప్రశంసించారు. విలువల విద్య పుస్తకాల్లోని కథలు చదివించారు. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక దృష్టిసారించి చక్కగా చదివేలా కృషి చేయాలని ఉపాధ్యాయులకు మార్గదర్శనం చేశారు.
అనంతరం పీఎంశ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చేరుకున్న అధికారులకు స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులు ఘనంగా గౌరవ వందనం సమర్పించారు. అనంతరం PAL ల్యాబ్, క్లిక్కర్ తరగతులు పరిశీలించి విద్యార్థుల సామర్థ్య, నైపుణ్యాలను అడిగి తెలుసుకున్నారు. స్పోర్ట్స్ ల్యాబ్ ను పరిశీలించి చదువుతో పాటు ఆటలపై మక్కువ చూపేలా తర్పీదునివ్వాలని ఉపాధ్యాయులను సూచించారు.
కాసేపు ఉపాధ్యాయునిగా…
పదో తరగతి విద్యార్థులతో ‘మిషన్ మార్చ్’ సన్నాహకాలపై చర్చిస్తూ, పరీక్షల ఒత్తిడి లేకుండా ఎలా ప్రణాళిక వేసుకోవాలో సూచించారు. ఈ సందర్భంగా జె. శ్యామలరావు కాసేపు ఉపాధ్యాయుడి అవతారమెత్తి స్వయంగా బోర్డుపై గణితం బోధించి, విద్యార్థుల నుంచి సమాధానాలు రాబట్టి వారిలో ఉత్సాహాన్ని నింపారు.
అనంతరం పాఠశాల ఆవరణలో జరుగుతున్న స్కూల్ కాంప్లెక్స్ సమావేశంలో ఉపాధ్యాయులతో సిలబస్ పూర్తి చేయడం, సులభ బోధనా పద్ధతులు, భాషా నైపుణ్యాల పెంపుదల తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు డా. కె.వి.శ్రీనివాసులురెడ్డి, ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ ఎం.వి.కృష్ణారెడ్డి గారు, శామో అడిషనల్ డైరెక్టర్ కె.నాగేశ్వరరావు, కాకినాడ ఆర్జేడీ జి.నాగమణి, కృష్ణా జిల్లా డీఈవో యు.వి.సుబ్బారావు, కంకిపాడు మండల డివైఈవో రవికుమార్, విద్యాశాఖాధికారులు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఎం.నాగరాజు, బి.పద్మావతి బాయి పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పట్టాల పంపిణీతో 26వేల పేద కుటుంబాలకు భరోసా

-డబుల్ ఇంజన్ సర్కార్‌తో పేదలకు వందల రెట్ల లబ్ది -ఎన్టీఆర్ జిల్లాలో ఇంటి పట్టాలు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *