-కళా ప్రతిభను చాటిన 300 మంది యువతీ యువకులు
-రాష్ట్ర స్థాయి పోటీలకు జిల్లా విజేతలు ఎంపిక
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
యువజన సర్వీసుల శాఖ, ఎన్టీఆర్ జిల్లా ఆధ్వర్యంలో జిల్లా స్థాయి యువజనోత్సవాలు–2026ను విజయవాడలోని నలంద డిగ్రీ కళాశాలలో ఉత్సాహభరితంగా నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు 300 మంది యువతీ యువకులు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ కళా నైపుణ్యాలను ప్రదర్శించారు.
ఫోక్ డాన్స్ గ్రూప్, నుక్కడ్ నాటక్ (వీధి నాటకం), పెయింటింగ్, కవితా రచన తదితర విభాగాల్లో నిర్వహించిన పోటీల్లో యువత ఉత్సాహంగా పాల్గొని ప్రతిభను చాటారు.
ఈ కార్యక్రమాన్ని యువజన సర్వీసుల శాఖ కమిషనర్ ఎస్. భరణి, ఐఎఫ్‌ఎస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యువతలోని సృజనాత్మకత, కళా ప్రతిభను వెలికితీసేందుకు యువజనోత్సవాలు చక్కని వేదికగా నిలుస్తాయని పేర్కొన్నారు. రాష్ట్రానికి చెందిన యువత జాతీయ స్థాయిలో తమ ప్రతిభను ప్రదర్శించి మంచి ఫలితాలు, బహుమతులు సాధించాలని ఆకాంక్షించారు.
వివిధ పోటీ విభాగాల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. జిల్లా స్థాయి పోటీల్లో విజయం సాధించిన యువతీ యువకులు నవంబర్‌లో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి ఉత్సవాల్లో పాల్గొంటారు.
Prajavartha Online Telugu News