Breaking News

ఈ నెల 30న పండ‌గ‌లా పేద‌ల‌కు ప‌ట్టాభిషేకం..

– సాకారం కానున్న 24 వేల‌కు పైగా పేద కుటుంబాల ద‌శాబ్దాల క‌ల‌
– కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించ‌నున్న ముఖ్య‌మంత్రి
– కార్య‌క్ర‌మం విజ‌య‌వంతానికి ప‌క‌డ్బందీ ఏర్పాట్లు
– జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పేద కుటుంబాల ద‌శాబ్దాల క‌ల‌ను సాకారం చేస్తూ అర్హులైన వారికి శాశ్వత చిరునామా, పూర్తి హక్కులతో చ‌ట్ట‌బ‌ద్ధ‌త క‌ల్పించే ల‌క్ష్యంగా రాష్ట్ర ప్ర‌భుత్వం ఈ నెల 30న పేద‌ల‌కు ప‌ట్టాభిషేకం కార్య‌క్ర‌మాన్ని పండ‌గ వాతావ‌ర‌ణంలో నిర్వ‌హించ‌నుంద‌ని.. ఈ కార్య‌క్ర‌మం విజ‌య‌వంతానికి అధికారులు ప‌టిష్ట స‌మ‌న్వ‌యంతో ప‌నిచేయాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ అన్నారు.
మంగ‌ళ‌వారం క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ‌.. జాయింట్ క‌లెక్ట‌ర్ ఇల‌క్కియ‌తో క‌లిసి క‌లెక్ట‌రేట్ శ్రీ పింగ‌ళి వెంక‌య్య స‌మావేశ మందిరంలో పేద‌ల ప‌ట్టాభిషేకం కార్య‌క్ర‌మంపై స‌మ‌న్వ‌య శాఖ‌ల అధికారులు, గ్యాల‌రీల ఇన్‌ఛార్జులు త‌దిత‌రుల‌తో స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ విజ‌య‌వాడ అజిత్ సింగ్‌న‌గ‌ర్‌లోని మాకినేని బ‌స‌వ‌పున్న‌య్య స్టేడియంలో గౌర‌వ ముఖ్య‌మంత్రి కార్య‌క్ర‌మాన్ని ప్రారంభిస్తార‌న్నారు. వివిధ ర‌కాల ప్ర‌భుత్వ భూముల్లో ఇళ్లు నిర్మించుకొని ఎన్నో ఏళ్లుగా నివ‌సిస్తున్న వారి ఇళ్ల స్థ‌లాల క్ర‌మ‌బ‌ద్ధీక‌ర‌ణ‌కు సంబంధించి ప్ర‌భుత్వ ఉత్త‌ర్వుల ప్ర‌కారం ల‌బ్ధిదారులను గుర్తించిన‌ట్లు తెలిపారు. ఇందుకు క్షేత్ర‌స్థాయిలో రెవెన్యూ అధికారులు గ‌త రెండేళ్లుగా ఎంతో కృషిచేశార‌న్నారు. ఎన్‌టీఆర్ ప‌ట్టాల‌తో పాటు వివిధ అసైనీ ప‌ట్టాలు క‌లిగిన వారు, అభ్య‌త‌రం లేని పోరంబోకు భూముల్లో వారసుల ఆక్రమణ/నివాసాలు, పీవోటీ ఉల్లంఘనలు ఇలా వివిధ కేట‌గిరీల‌కు సంబంధించి జిల్లాలో తొలిద‌శ‌లో క్ర‌మ‌బ‌ద్ధీక‌ర‌ణ‌కు 24 వేల మందికి పైగా ల‌బ్ధిదారుల‌ను గుర్తించ‌డం జ‌రిగింద‌న్నారు. వీరికి ఆస్తిపై పూర్తి హ‌క్కులు క‌ల్పించేలా ప్ర‌భుత్వం ప‌త్రాలు అందించ‌నుంద‌ని.. దీంతో ద‌శాబ్దాలుగా తాము ఉంటున్న ఇళ్ల‌పై ఉన్న అనిశ్చితి తొల‌గ‌నుందని.. 616.56 ఎకరాల (దాదాపు 29,84,145 చ‌ద‌ర‌పు గ‌జాలు)కు పైగా భూమికి సంబంధించి ప్రైవేటు ఆస్తికి స‌మానంగా అన్ని హ‌క్కులు క‌ల్పించే ప‌త్రాలు చేతికంద‌నున్నాయ‌న్నారు. వీటి ఎస్ఆర్ విలువ దాదాపు రూ. 9,800 కోట్లు కాగా మార్కెట్ విలువ రూ. 23 వేల కోట్ల‌కు పైగా ఉంటుంది.
*అనంత‌రం క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ.. జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ, పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు అధికారుల‌తో కలిసి మాకినేని బ‌స‌వ‌పున్న‌య్య స్టేడియంలో చేస్తున్న ఏర్పాట్ల‌ను ప‌రిశీలించారు. దాదాపు 100 ప్ర‌త్యేక కౌంట‌ర్ల ద్వారా ల‌బ్ధిదారుల‌కు హక్కు ప‌త్రాలు అందించేందుకు ఏర్పాట్లు చేశారు. వీరికి ప్ర‌త్యేక ఇన్‌ఛార్జుల‌ను నియ‌మించగా.. ఎక్క‌డా ఎలాంటి ఇబ్బంది లేకుండా స‌జావుగా కార్య‌క్ర‌మం జ‌రిగేలా దిశానిర్దేశం చేశారు. ల‌బ్ధిదారుల‌కు ర‌వాణా సౌక‌ర్యం, వేదిక వ‌ద్ద నిరంత‌ర విద్యుత్ స‌ర‌ఫ‌రా, వైద్య శిబిరాల ఏర్పాటు, సీటింగ్ అరేంజ్‌మెంట్, ప‌బ్లిక్ అడ్రెసింగ్ సిస్ట‌మ్ త‌దిత‌రాల‌కు సంబంధించి సూచ‌న‌లిచ్చారు. స‌మావేశంలో డీఆర్‌వో ఎం.ల‌క్ష్మీన‌ర‌సింహం, విజ‌య‌వాడ ఆర్‌డీవో వెన్నెల శ్రీను త‌దిత‌రులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పట్టాల పంపిణీతో 26వేల పేద కుటుంబాలకు భరోసా

-డబుల్ ఇంజన్ సర్కార్‌తో పేదలకు వందల రెట్ల లబ్ది -ఎన్టీఆర్ జిల్లాలో ఇంటి పట్టాలు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *