Breaking News

గవర్నర్ ను మర్యాద పూర్వకంగా కలిసిన ఎంఎల్ సిలు తలశిల, లేళ్ల…


విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నూతనంగా బాధ్యతలు తీసుకున్న శాసన పరిషత్తు సభ్యులు తలశిల రఘురామ్, లేళ్ల అప్పిరెడ్డి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ ను మర్యాద పూర్వకంగా కలిసారు. శనివారం రాజ్ భవన్ వేదికగా ఈ భేటీ జరగగా గవర్నర్ వీరి పూర్వాపరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజా సేవే పరమావధిగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. శాసన వ్యవస్ధలో క్రియాశీలక పాత్ర పోషించే శాసన పరిషత్తుకు వన్నె తీసుకురావాలని, అర్ధవంతమైన చర్యలతో ప్రజా సమస్యలకు పరిష్కారాలు కనుగొనాలని గవర్నర్ సూచించారు. ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్తగా కూడా వ్యవహరిస్తున్న తలశిల రఘురామ్ ప్రభుత్వం అమలు చేస్తున్న విభిన్న సంక్షేమ కార్యక్రమాలను గురించి గవర్నర్ కు వివరించగా, మంచి కార్యక్రమాలను తీసుకున్నారని ప్రస్తుతించారు. పార్టీ కార్యాలయ సమన్వయకర్తగా వ్యవహరిస్తున్న లేళ్ల అప్పిరెడ్డి ముఖ్యమంత్రి జన్మదినం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ క్రాస్ నేతృత్వంలో నిర్వహించిన రక్తదాన శిబిరాలు, ఇతర సేవ కార్యక్రమాలను గురించి గవర్నర్ కు వివరించారు. మరోవైపు క్రిస్మస్ వేడుకలను పురస్కరించుకుని రఘురామ్, అప్పిరెడ్డి గౌరవ గవర్నర్ కు తమ శుభాకాంక్షలు తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గుంటూరు జిల్లాలో ఉన్న యువతి యువకులకు గొప్ప సువర్ణ అవకాశం – పీఎం ఇంటర్న్‌షిప్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ది సంస్ద ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వారి ఆదేశముల మేరకు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *