విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మాటల్లో వర్ణించలేనంతటి విద్వవైభవం కలిగిన సరస్వతీమూర్తి, రాష్ట్రపతి పురస్కార గ్రహీత, ‘బ్రహ్మణ్య సార్వభౌమ’, ‘సాంగ స్వాధ్యాయ భాస్కర’ మొదలైన అనేక బిరుదాలు పొందిన విద్వన్మూర్తి, మహామహోపాధ్యాయ బ్రహ్మశ్రీ విష్ణుభట్ల సుబ్రహ్మణ్య సలక్షణ ఘనపాఠి శనివారం మన వేదపాఠశాలను (శ్రీ షణ్ముఖ వేదవిద్యాలయం, కొత్తూరు తాడేపల్లి, విజయవాడ–12) సందర్శించారు. ఆ మహానుభావుడి పాదస్పర్శతో పాఠశాల ప్రాంగణం పులకరించింది. విద్యార్థులను అందరినీ పేరుపేరునా పలకరించారు. పాఠశాల నిర్వహణ విధానం అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. వేదవిద్య గొప్పదనం, గురుభక్తి, ఇతర విద్యలకన్నా వేదవిద్య ఎందుకు ఉన్నతమైనది, ఆచార సంప్రదాయాలు పాటించాల్సిన అవసరం తదితర విషయాలను గురువు గారు విద్యార్థులకు చక్కగా వివరించారు. మన వేద పాఠశాలకు మార్గదర్శి, తిరుమల తిరుపతి దేవస్థానం ఇ.సి. సభ్యులు, ‘స్వాధ్యాయరత్న’, ‘శృతిభూషణం’ బ్రహ్మశ్రీ విష్ణుభట్ల లక్ష్మీనారాయణ ఘనపాఠి గారు కూడా సలక్షణ ఘనపాఠి గారి వెంట ఉన్నారు. వేదవిద్యా ప్రపంచంలో శిఖరాయమైన కీర్తి కలిగిన ఇద్దరు వేదవిద్వన్మూర్తులు మన వేదపాఠశాలకు రావటం మన పాఠశాల చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నారు. పాఠశాల అధ్యాపకులకు వారిద్దరూ నిర్వహణ విషయంలో అనేక సూచనలు చేసారు. పాఠశాల మరింతగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ అందరినీ ఆశీర్వదించారు.
Tags vijayawada
Check Also
గుంటూరు జిల్లాలో ఉన్న యువతి యువకులకు గొప్ప సువర్ణ అవకాశం – పీఎం ఇంటర్న్‌షిప్
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ది సంస్ద ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వారి ఆదేశముల మేరకు …