విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ముత్యాలంపాడు సాయిబాబా గుడిలో నూతన క్యాలెండర్ 2022 ఆవిష్కరణ కార్యక్రమం శనివారం ఆలయ గౌరవ అధ్యక్షుడు పునుగు గౌతంరెడ్డీ చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం దేవస్థానంలోని బాబా వారి మూర్తి రూపాన్ని భక్తులు వారి ఇంటి నుండే దర్శించేలా క్యాలెండర్ రూపంలో ఉచితంగా భక్తులందరికీ ఇవ్వడం ఆనవాయితీగా వస్తుందని, అదేవిధంగా వచ్చే నూతన సంవత్సరం క్యాలెండర్ కూడా భక్తులకు ఉచితంగా అందిస్తున్నామని ఆయన అన్నారు. రాబోయే నూతన సంవత్సరం 2022 జనవరి 1 ఒకటో తేదీన బాబా వారికి లక్షా ఎనిమిది కేజీల బియ్యంతో అభిషేక కార్యక్రమం జరుగుతుందని ఈ కార్యక్రమానికి మా ఆలయ యాచకుడు లక్ష రూపాయలు విరాళం ఇవ్వడం జరిగిందని, ఈకార్యకమానికి వివిధ పార్టీల రాజకీయ నాయకులు, సామాజిక సేవా కార్యకర్తలను, పలు ఆద్యాత్మిక స్వామిజిలను ఆహ్వానించామని ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమాన్ని భక్తులందరూ స్వచ్ఛంద పాల్గొని సహకరిస్తున్నారని ఆన్నారు. ఈ దేవస్థానంలో గతంలో లక్షా ఎనిమిది కొబ్బరికాయలతో రికార్డు స్థాయిలో బాబావారికి అభిషేక కార్యక్రమం చేశామని అదే మాదిరిగా ఈ కార్యక్రమాన్ని కూడా దిగ్విజయం చేయాలని బాబా గారి ఆశీస్సులు అందరికి ఉండాలని కోరుకుంటున్నామని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో కమిటీ సభ్యులు, భక్తులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
గుంటూరు జిల్లాలో ఉన్న యువతి యువకులకు గొప్ప సువర్ణ అవకాశం – పీఎం ఇంటర్న్‌షిప్
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ది సంస్ద ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వారి ఆదేశముల మేరకు …