Breaking News

మొట్టమొదటి మహిళా సాంఘీక విప్లవకారిణి సావిత్రిభాయి పూలే 191వ జన్మదిన వేడుకలు నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ బ్యాక్వార్డ్ క్లాస్ ఫెడరేషన్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ మారుతీనగర్లోని ఆంధ్రప్రదేశ్ బ్యాక్వార్డ్ క్లాస్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో  సోమవారం భారతదేశంలో మొట్టమొదటి సాంఘీక విప్లవకారిణి మహాత్మా జ్యోతిరావు పూలే సహదర్మాచరి సావిత్రిభాయి పూలే 191వ జయంతిని ఛైర్మన్/రాష్ట్ర అధ్యక్షుడు తమ్మిశెట్టి చక్రవర్తి సావిత్రిభాయి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నిర్వహించినారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మహారాష్ట్ర సతారా జిల్లాలోని నాయగావ్ గ్రామంలో 1831 జనవరి 3న జన్మించిన సావిత్రిభాయి తన ఎనిమిదేళ్ల వయస్సులో జ్యోతిరావు పూలేని వివాహం చేసుకుని ఆయన ప్రోత్సాహంతో చిన్న వయసులోనే విద్యావంతరాలు అయి భారతదేశంలో మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా పాఠశాలని ప్రారంభించి అణచివేతకు గురైన వర్గాలకు, మహిళలకు సకల హక్కుల కోసం సామాజిక బాధ్యతగా సాంఘీక విపమవకారిణిగా మారి పోరాటం చేసిన గొప్ప సంఘసంస్కర్త అని గుర్తుచేశారు. ఈకార్యక్రమంలో రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు వేముల శ్రీనివాసరావు, కృష్ణా జిల్లా మహిళా అధ్యక్షురాలు మోర్ల లక్ష్మీ, బి.సి. నాయకులు కొటేశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గుంటూరు జిల్లాలో ఉన్న యువతి యువకులకు గొప్ప సువర్ణ అవకాశం – పీఎం ఇంటర్న్‌షిప్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ది సంస్ద ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వారి ఆదేశముల మేరకు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *