విస్సన్నపేట, నేటి పత్రిక ప్రజావార్త :
జగనన్న పాల వెల్లువ పధకం ద్వారా పాల సేకరణను మరింత పెంచాలని జిల్లా కలెక్టర్ జె. నివాస్ అన్నారు. విస్సన్నపేట మండలం కొండపర్వ గ్రామంలో జగనన్న పాల వెల్లువ పథకంపై ప్రమోటర్లు , పాడి రైతులు, అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నివాస్ మాట్లాడుతూ జగనన్న పాల వెల్లువ ప్రారంభం ఐన తరువాత జిల్లాలో ప్రైవేట్ పాల డైరీలు తమ పాల సేకరణ ధరను పెంచాయన్నారు. దీనిబట్టీ జగనన్న పాల వెల్లువ కార్యక్రమానికి జిల్లాలో మంచి స్పందన లభిస్తున్నదో అర్థమవుతుందన్నారు. జిల్లాలో జగనన్న పాల వెల్లువను పాడి రైతులు చక్కగా వినియోగించుకుంటున్నారని, అయినప్పటికీ పాల సేకరణ ఇంకా పెరగవలసిన అవసరం ఉందన్నారు. ప్రైవేట్ డైరీల పాల సేకరణ కేంద్రాలలో పాలల్లో వెన్న శాతం కొలిచేందుకు సరైన పరికరాలు లేక తక్కువ ధరకే పాలను కొనుగోలు చేస్తున్నారని రైతులు అర్ధం చేసుకున్నారని, పాలు అమ్మెందుకు జగనన్న పాల వెల్లువ పాల సేకరణ కేంద్రానికి తరలి వస్తున్నారన్నారు. అమూల్ సంస్థ పాడి రైతులకు అధిక ధర, రుణ పరపతి సౌకర్యం, పాడి పశువులకు పోషక విలువలతో కూడిన దాణా అందించడం వంటి ఎన్నో ప్రయోజనాలను అందిస్తున్నదన్నారు. ఈ ప్రయోజనాలను గ్రామంలోని ప్రతీ రైతుకు అవగాహన కలిగించి మరింత పాలు సేకరణ జరిగేలా ప్రమోటర్లు, వాలంటీర్లు, అధికారులు కృషి చేయాలన్నారు.
అనంతరం గ్రామంలోని గ్రామ సచివాలయాన్ని జిల్లా కలెక్టర్ జె. నివాస్ సందర్శించి సచివాలయం ద్వారా ప్రజలకు అందుతున్న సేవలను గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల లబ్ధిదారుల జాబితాలను నోటీసు బోర్డులో ప్రదర్శించాలని సిబ్బందిని జిల్లా కలెక్టర్ జె. నివాస్ ఆదేశించారు. సమావేశంలో తహసీల్దార్ బి. మురళీకృష్ణ , సర్పంచ్ రమేష్ బాబు,, ఎస్సై పరిమి కిశోర్ , పి ఏ సి ఎస్ అధ్యక్షలు చంద్రశేఖర్, వి ఆర్ ఓ కాంతారావు, ఆర్ ఐ. వెంకటేశ్వరరావు, వైఎస్ ఆర్ సి పి నాయకులూ గాజుల శ్రీనివాస్, రెవిన్యూ , పశు సంవర్ధక శాఖ, జగనన్న పాల వెల్లువ పధకం ప్రమోటర్లు, గ్రామ వాలంటీర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు
Tags Vissannapeta
Check Also
వనితకు వన్నె తెచ్చే అద్భుత వస్త్ర ప్రదర్శన Niche Handloom Marketing Expo-2024-25
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రత్యేక చేనేత వస్త్ర ప్రదర్శన Niche Handloom Marketing Expo-2024-25 ను వీవర్స్ …