Breaking News

నూతన అధ్యక్షునిగా మీరు నాపై ఉంచిన నమ్మకమును నిలబెట్టుకుంటాను…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
APMESA రాష్ట్ర అధ్యక్షులు తిమ్మసర్తి నాగేశ్వరరావు APMESA VMC యూనిట్ నూతన అధ్యక్షుల ఎన్నిక కొరకు కార్యవర్గ సభ్యుల సమావేశము నగరపాలక సంస్థ ఎంప్లాయిస్ అసోసియేషన్ హాల్ నందు నిర్వహించుట జరిగింది.
ఈ సమావేశములో APMESA రాష్ట్ర నూతన అధ్యక్షులు తిమ్మసర్తి నాగేశ్వరరావు, APMESA VMC యూనిట్ జనరల్ సెక్రెటరి సలీం అహ్మద్ మరియు కార్యవర్గ సభ్యులు ఏకాభి ప్రాయముతో APMESA VMC యూనిట్ నూతన అధ్యక్షులుగా M.శ్యామ్ సురేంద్ర బాబు ని ఎన్నుకుని అభినందించడం జరిగింది.
ఈ సందర్భములో APMESA VMC యూనిట్ నూతన అధ్యక్షులు M.శ్యామ్ సురేంద్ర బాబు మాట్లాడుతూ విజయవాడ నగరపాలక సంస్థ అందరు ఉద్యోగులకు, ఏపీ జేఏసీ అమరావతి ఆధ్వర్యంలో మున్సిపల్ ఉద్యోగుల సర్వీస్ అసోసియేషన్ విజయవాడ యూనిట్ అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు, రాష్ట్ర నాయకత్వానికి మరియు ఎన్టీఆర్ జిల్లా నాయకత్వానికి ధన్యవాదములు తెలియజేశారు.
అదేవిధముగా APMESA VMC యూనిట్ నూతన అధ్యక్షునిగా మీరు నాపై ఉంచిన నమ్మకమును నిలబెట్టుకుంటానని మన ఉద్యోగుల సమస్యల సాధన కొరకు నా శక్తివంచన లేకుండా కృషి చేస్తానని తెలియజేయుచున్నాను.
ఈ కార్యక్రమములో ఆంధ్రప్రదేశ్ మునిసిపల్ ఎంప్లాయిస్ సర్వీస్ అసోసియేషన్ స్టేట్ అసోసియేట్ ప్రెసిడెంట్ కె. శివరామ ప్రసాద్, స్టేట్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు G.శ్రీకృష్ణ దేవరాయలు, VMC యూనిట్ జనరల్ సెక్రెటరి సలీం అహ్మద్, ఉపాధ్యక్షులు SK.రాంబాబు, అసోసియేట్ ప్రెసిడెంట్ గుర్రం ప్రకాష్ సాగర్, ఆర్గనైజింగ్ సెక్రెటరి కె.సురేంద్ర కుమార్ ,పబ్లిసిటీ సెక్రెటరి జ.మారుతీ రావు , ట్రజరర్ బి.ఉదయ భాస్కర్, వైస్ ప్రెసిడెంట్స్ కె.శారదా రాణి, డి.వెంకటేశ్వర రావు, A. జయప్రభు, S.N మూర్తి, సెక్రెటరీస్ పి. మధుసూదానరావు, శుభకరరావు, K. కరుణ, జాయింట్ సెక్రెటరీస్ SK. అహమ్మద్ అలీ, పి.ఎస్.రాజశేఖర్, వి. భాస్కరరావు, దీపక్ కుమార్,  బి.సీత, టి.అరుణ, ఎగ్జిక్యూటివ్ మెంబెర్స్ J. షర్మిల, G. పద్మశ్రీ, k. శ్యామ్యూల్, J. దుర్గారావు, S. రవి మరియు విజయవాడ నగరపాలక సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విశాఖ రైల్వేజోన్‌ ఏర్పాటు చేస్తూ గెజిట్‌ విడుదలపై సీఎం చంద్రబాబు హర్షం

-రాష్ట్ర ప్రజల చిరకాల స్వప్నం నెరవేరిందని ముఖ్యమంత్రి వ్యాఖ్య అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖ కేంద్రంగా దక్షిణ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *