అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
73వ గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని అమరావతి అసెంబ్లీ భవనంపై జరిగన గణతంత్ర దినోత్స వేడుకల్లో రాష్ట్ర శాసన మండలి అధ్యక్షులు కె.మోషేన్ రాజు పాల్గొని పోలీసుల గౌరవ వందనం స్వీకరించి జాతిపిత మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘణంగా నివాళులర్పించిన పిదప జాతీయ జెండాను ఎగుర వేశారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.ప్ పంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం గల దేశం మనదని తెలిపారు.ప్రపంచ దేశాల్లో భారత్ అగ్రగామిగా నిలిచిందంటే అందుకు కారణం మన రాజ్యాంగంష యొక్క గొప్పదనమేనని పేర్కొన్నారు.రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమాన అవకాశాలు,జీవించే హక్కు కల్పించిందని తెలిపారు.రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ నేతృత్వంలోగల బృందం వివిధ దేశాల రాజ్యాంగాలను సుమారు రెండున్నర యేళ్లపాటు పరిశీలించి మన దేశానికి అత్యుత్తమైన రాజ్యాంగాన్ని రూపొందించారని ఆయన ఈసందర్భంగా గుర్తు చేశారు.
రాష్ట్రంలో ప్రభుత్వం అనేక అభివృద్ది సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేస్తూ రాష్ట్రాన్ని దేశంలో అగ్రగామిగా నిలిపేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి విశేష కృషి చేస్తున్నారని కౌన్సిల్ చైర్మన్ కె.మోషేన్ రాజు చెప్పారు.
అంతకు ముందు చైర్మన్ మోషేన్ రాజు పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈకార్యక్రమంలో శాసన మండలి డిప్యూటీ చైర్మన్ యం.జకియా ఖానం,అసెంబ్లీ కార్యాదర్శి పి.బాలకృష్ణమాచార్యులు,కౌన్సిల్ చీఫ్ మార్షల్ మురళి,ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Tags amaravathi
Check Also
గుంటూరు జిల్లాలో ఉన్న యువతి యువకులకు గొప్ప సువర్ణ అవకాశం – పీఎం ఇంటర్న్‌షిప్
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ది సంస్ద ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వారి ఆదేశముల మేరకు …