విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
7సెన్సెస్ లగ్జరీ స్పా ని గురువారం ముఖ్యఅతిథిగా సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మరియు అర్బన్ వైసిపి ప్రెసిడెంట్ బొప్పన భవన కుమార్ ల చే ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా బొప్పన భవన కుమార్ మాట్లాడుతూ ప్రవీణ్ సింగల వారు ఢిల్లీ నుంచి ఇక్కడ 7సెన్సెస్ లగ్జరీ స్పా ను నిర్మలా కాన్వెంట్ జంక్షన్ ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ స్పా సెంటర్ లో శారీరక మానసిక రిలాక్సేషన్ కి కావలసిన వివిధ రకాలైన పద్ధతులలో వివిధ స్థాయిల్లో పలు ప్రక్రియల ద్వారా అందుబాటు ధరల్లో నగరం నడిబొడ్డున ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. గతంలో మెట్రో పాలిటీ సిటీ లో మాత్రమే ఏర్పాటు చేసే ఈ స్పా సెంటర్లు ఇప్పుడు మన విజయవాడ నగరంలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. స్పా సెంటర్ నందు ప్రత్యేక నిపుణులతో హై స్టాండర్డ్ సౌకర్యాలతో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ అవకాశాన్ని నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నిర్వాహకులు మాట్లాడుతూ ఆన్‌లైన్ స్పా బుకింగ్, శానిటైజర్ చేసిన చేసిన గదుల్లో తాయ్ యోగ మసాజ్, బాడీ స్క్రబ్బింగ్, స్పా సర్వీసెస్, ఫుట్ మసాజ్, హెడ్ మసాజ్, ఫేస్ మసాజ్, బాడీ మసాజ్, బాడీ వ్యాక్సింగ్, జాకుజీలు, లోషన్ చికిత్సలు, మసాజ్, ఆయిల్ చికిత్సలు, పెడిక్యూర్‌లు, ప్రైవేట్ సూట్‌లు, ఆవిరి స్నానాలు, చర్మ చికిత్సలు మరియు ట్యానింగ్ తదితర సేవలు అందిస్తున్నామన్నారు.