Breaking News

క్రీయోటివిటి కోసం ఫోటోగ్రాఫర్ల తపన…

తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త :
తాముతీసే ఫోటోలో క్రియేటివిటి కొరకు ఫోటోగ్రాఫర్లు తపన తో ఆరాటపడి చక్కటి ఫోటోలను సమాజానికి అందిస్తారని తెనాలి శాసన సభ్యులు అన్నాబత్తుని శివకుమార్ అన్నారు. మంగళవారం కొత్తపేటలోని NGO కళ్యాణమండపంలో వీడియో & ఫోటోగ్రాఫర్స్ వెల్ఫేరు అసోసియేషన్ నూతన బాడి ప్రమాణ స్వీకారమనకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ఆదినుండి తెనాలి ఫోటోగ్రఫికి మంచి పేరుందని బెజవాడ నుండి ఇక్కడకు ప్రింటింగుకోసం వచ్చెవారని గుర్తు చేసుకొని ఆ టెక్నాలజీని ఇక్కడ కొనసాగిస్తున్నందుకు స్టూడియో యాజమాన్యములను అభినందించారు. ఈ సందర్భంగా అసోషియేన్ భవన నిర్మాణ నిమిత్తం హాలునిర్మాణ నిమిత్తం వారికి స్థలమును 2, 3నెలలలో కెటాయించనున్నట్లు హర్షథ్వానాలమథ్య అన్నారు. సభ్యులు ఎవరికైనా అర్హతుంటె వారి జగనన్న శాస్వత గృహం మంజూరు చేయనున్నట్లు తెలిపారు. తెనాలివైస్ ఛైర్మన్ మాలేపాటి హరిప్రసాద్ మాట్లాడుతూ మనకురెండు కళ్ళంటే ఫోటోగ్రాఫర్ కు వళ్ళంతా లక్షల కళ్ళతోమంచి ఫోటో అందిస్తారని అభినందించారు. ఈ సందర్భంగా ననూతన కార్యవర్గ అద్యక్షునిగా ఫ్రాంక్లిన్ బాబు శక్రటరీగా నాగరాజు ట్రజరర్ గా భరత్ వైస్ ప్రసిండెంటు K.చైతన్య PRO గోపి మిగిలిన కార్యవర్గ సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో తాలూక CIసుబ్రమణ్యం 1Town SI కొమ్మలపాటి శ్రీథర్ ఆర్యవైశ్య నాయకులు భాస్కరుని శ్రీనివాస్ కూరపాటి రవిబాబు ప్రసాద్ (ల్యాబ్ అథినేత)అక్కిదాసు కిరణ్ , రత్నం తదితరులు హపాల్గొన్నారు.

Check Also

కుల గణన జాబితాపై సవరణల అర్జీలకు జనవరి 12 వరకు గడువు పెంపు…

-నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్  గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఎస్సీ కుల గణన జాబితాలో సవరణలకు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *