విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
భారతదేశం మరియు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ యొక్క గొప్ప మరియు ప్రత్యేకమైన వారసత్వ సంస్కృతి అయిన చేనేతను ప్రోత్సహించడం మరియు ప్రాచుర్యం పొందేలా చేయడం అనే ఉద్దేశ్యంతో, జౌళి మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం వారి ఆధ్వర్యం మరియు సహకారంతో వీవర్స్ సర్వీస్ సెంటర్ వారు ప్రత్యేక చేనేత వస్త్ర ప్రదర్శన Niche Handloom Marketing Expo-2024-25 ను విజయవాడ, మొగల్రాజపురం A ప్లస్ కన్వెన్షన్ సెంటర్ నందు జనవరి 08 నుండి 14 వ తేదీ వరకు వారం రోజుల పాటు నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమం ఎలాంటి లాభాపేక్ష లేకుండా గ్రామీణ చేనేత కార్మికులు తమ ఉత్పత్తులను మధ్యవర్తులను నివారించి సక్రమంగా విక్రయించి వారి జీవనాన్ని మెరుగుపరచుకోవడానికి ప్రత్యక్ష మార్కెటింగ్ సౌకర్యాన్ని అందించాలనే ఉద్దేశంతో ఈ చేనేత వస్త్ర ప్రదర్శనను ఏర్పాటు చేసినట్లు అంతే కాకుండా దేశవ్యాప్తంగా 40 నుండి 50 వరకు గల వివిద రకాల నేత కార్మికులు మరియు చేనేత సంస్థలు వారి విభిన్న చేనేత ఉత్పత్తులను పరిచయం చేయడానికి ఈ ప్రదర్శనలో పాల్గొననున్నాయని చేనేత & జౌళి, పరిశ్రమలు మరియు వాణిజ్య శాఖ ప్రధాన కార్యదర్శి K.సునీత ఒక ప్రకటనలో తెలియచేసారు.
ఈ కార్యక్రమాన్ని చేనేత & జౌళి, BC & EWS సంక్షేమ శాఖ మంత్రి. S. సవిత, 09.01.2025 న ప్రారంభించనున్నారు. వీరితో పాటు వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్, విజయవాడ రాజ్యసభ సభ్యులు శశ్రీ.కేశినేని శివనాథ్ మరియు ఇతర ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు, వివిద శాఖలకు చెందిన అధికారులు, ఉద్యోగులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారని నిర్వాహకులు తెలియజేసారు.
Prajavartha Online Telugu News