రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రబీ సీజన్ పూర్తి కావస్తున్నందున ఉపాధిహామీ పనులను గుర్తించి మస్టర్ రోల్స్ సిద్దం చెయ్యాలని జిల్లా కలెక్టర్ మాధవీలత స్పష్టం చేశారు. గురువారం రాష్ట్ర ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వీసీ అనంతరం పంచాయతీ రాజ్ కమిషనర్ విడివిడిగా గ్రామ , వార్డు సచివాలయ సర్వీసులు, మౌలిక సదుపాయాలు, మత్స్యకార భరోసా, జగనన్న వసతి, విద్య దీవెన, ఉపాధి హామీ పనులు, జలకళ , సచివాలయాలు, అర్భికే విలేజ్ హెల్త్ క్లినిక్స్, క్లాప్ అంశాలపై జిల్లా కలెక్టర్ల లతో దృశ్య మధ్యమ ద్వారా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి స్థానిక కలెక్టరేట్ నుంచి కలెక్టర్ ఇతర అధికారులు హాజరయ్యారు. ఈ దృశ్య సమావేశం అనంతరం జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. మండలఅభివృద్ధి అధికారులు నోడల్ అధికారిగా మండలంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఉపాధి హామీ పథకం ద్వారా పనులు కల్పించడానికి, క్షేత్రస్థాయిలో పనులు గుర్తించాలన్నారు. అభివృద్ధి లక్ష్యంగా పనులకు ప్రాధాన్యత ఇస్తే లక్ష్యాలను సాధించ గలమన్నారు. ఎంపీడీఓ లు ఉపాధి కోసం క్షేత్రస్థాయిలో పనుల వివరాలు తెలుసుకుని లక్ష్యాలకు అనుగుణంగా ప్రణాళిక సిద్ధం చెయ్యాలన్నారు. సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు పారదర్శకంగా పరిపాలన లక్ష్యంగా చేసుకుని ఏర్పాటు చెయ్యడం వలన అర్హులైన వారికి పథకాలు అమలు చేయడం జరుగుతున్నదని కలెక్టర్ మాధవీలత పేర్కొన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు గ్రామాలలో ప్రజలతో మమేకమైన సందర్భంలో సచివాలయ సందర్శన చెయ్యడం జరుగుతుందన్నారు. ఆ సమయంలో సచివాలయం లో పనిచేసే క్షేత్ర స్థాయి కార్యదర్శులు ప్రజా ప్రతినిధులతో కలిసి పాల్గొన వలసి ఉందన్నారు. ఈ సమావేశంలో డ్వామా ఇంఛార్జి పిడి పి. జగదాంబ, ఆర్డబ్ల్యుఎస్ ఎస్ఈ బాలశంకర్, జిల్లాపంచాయతీ అధికారి సత్యనారాయణ, సీపీఓ పి.రాము తదితరులు హాజరయ్యారు.