Breaking News

పర్యాటక శాఖ అభివృద్ధికి అధికారులు చిత్తశుద్ధితో కృషి చేయాలి

-జానపద కళారూపాలను ప్రోత్సహించాలి : రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్.కె.రోజా

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
పర్యాటక శాఖ అభివృద్ధికి అధికారులు చిత్తశుద్ధితో కృషి చేయాలని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్ కే రోజా పేర్కొన్నారు. శనివారం స్థానిక శ్రీ పద్మావతి అతిథిగృహంలో తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, నెల్లూరు జిల్లాల పర్యాటక శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పర్యాటక శాఖ మంత్రి మాట్లాడుతూ తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, నెల్లూరు జిల్లాలోని పర్యాటక ప్రదేశాలను అభివృద్ధి చేయాలని తెలిపారు. యాత్రికులకు అనుగుణంగా తిరుపతి జిల్లాలోని తలకోన చిత్తూరు జిల్లాలోని కాణిపాకం, నగరిలో రిసార్ట్స్ లో వసతి సముదాయాలను, షాపులను ఏర్పాటు చేయాలని తెలిపారు. ముఖ్యంగా తలకోన లో ఎకో టూరిజంను ఏర్పాటు చేయాలని తెలిపారు. కాళహస్తిలో రోప్ వే, ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు పెట్టమని తెలిపారు. ప్రసాదం స్కీమ్ కింద కాణిపాక ఆలయంలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్వంలో కళ్యాణ మండపాలు, కాటేజీలు కట్టడానికి ప్రతిపాదనలు పెట్టడం జరిగిందని తెలియజేశారు. నెల్లూరు లోని మైపాడు బీచ్, చిత్తూరులోనే హార్స్లీ హిల్స్ లో కాటేజీలను రిపేరికి చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. నిర్మాణం పూర్తి కాని మరియు ఖాళీగా నెల్లూరు మరియు చిత్తూరులో రెస్టారెంట్ లను కాంట్రాక్టు ద్వారా లేదా టూరిజం శాఖ ద్వారా అయిన పూర్తి చేసి టూరిజం ను బాగా అభివృద్ధి చేయాలని సంబంధిత అధికారులకు తెలిపారు . జానపద కళాకారులకు గుర్తింపు కార్డు లేని వారిని గుర్తించి తద్వారా సదస్సులు లాంటివి ఏర్పాటు చేసి గుర్తింపు కార్డులు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. సాంప్రదాయ కళా రూపాలు కనుమరుగవుతున్న రోజులలో సాంప్రదాయ కళా రూపమైన జానపద పోటీలను జిల్లాల వారీగా ఏర్పాటు చేసి అందులోంచి మెరుగైన కళాకారులకు సౌత్ జోన్ లెవెల్ లో పోటీలు నిర్వహించి బహుమతులు అందజేయడం జరుగుతుందన్నారు. ఇలాంటి పోటీలను నిర్వహించడం వలన వాళ్ళని ఆర్థికంగా ఆదుకోవడమే కాకుండా వారి నైపుణ్యాలతో పాటు ప్రజలకు కూడా జానపద కళారూపాల పట్ల ఆసక్తి పెరుగుతుందని తెలిపారు. హస్త కళాకారులకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి కాణిపాకం, నగిరి లో స్థలాలను పరిశీలించి శిల్పారామాలను ఏర్పాటు చేయాలని సూచించారు. తిరుపతిలో జరుగుతున్న శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతర కు ఫండ్స్ రిలీజ్ చేసిన పర్యాటక శాఖ మంత్రి కి పర్యాటక శాఖ అధికారులు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఏపీ స్టేట్ క్రియేటివ్ అండ్ కల్చరల్ కమిషన్ చైర్పర్సన్ వంగపండు ఉష, తిరుపతి, చిత్తూరు జిల్లాల పర్యాటక అధికారి ఉమాపతి, అన్నమయ్య నెల్లూరు జిల్లాల పర్యాటక అధికారి నాగభూషణ, సెట్విన్ సీఈవో మురళి కృష్ణా, ఏపీ టి డిసి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, సుబ్రహ్మణ్యం రాజు,ఏపీ టి డివిజనల్ మేనేజర్ గిరిధర్ రెడ్డి, ఏపీ టి డి సి ట్రాన్స్పోర్ట్ అధికారి మల్లికార్జున తిరుపతి శిల్పారామం ఏవో ఖాదర్ వల్లి తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రధాని మోదీ ప్రపంచం మెచ్చిన నాయకుడు

-అభివృద్ధి, సంక్షేమం, సంస్కరణలు, సుపరిపాలన మోదీ నినాదాలు -ఒకేరోజున రూ.2,08,548 కోట్ల పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఒక రికార్డ్ -ఇంతటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *